BigTV English

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Central Minister Bandi Sanjay Comments: కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని కోనరావుపేటలో బండి సంజయ్ పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఏకలవ్య మోడల్ పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ఆయన మాట్లాడి వారికి అందుతున్న భోజన, వసతి, విద్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారితో మాట్లాడుతున్న క్రమంలో బండి సంజయ్ పలు ప్రశ్నలు అడిగారు. దీంతో వారు విస్తుపోయే సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారంటూ విద్యార్థులను బండి సంజయ్ అడగడంతో వారు అన్నంలో రాళ్లు వస్తున్నాయని, ఇటు టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆయనకు చెప్పారని తెలుస్తోంది. వెంటనే ఆయన సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు తినే ఆహారంలో రాళ్లు వస్తున్నాయంటా.. అదే మన పిల్లలకైతే ఇదే విధంగా రాళ్లతో ఉన్న అన్నం పెడుతామా ? అంటూ వారిని ప్రశ్నించారని సమాచారం. మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా హెచ్చరిస్తున్నా ఇంకోసారి వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కేంద్రమంత్రి ఆగ్రహం చేశారంటా.


Also Read: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

అనంతరం ఆయన టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ తన పరిధిలోని ఏకలవ్య పాఠశాలలను సందర్శించి సమస్యలను తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి వివరాంచారు. ‘2018-19లో దేశవ్యాప్తంగా 50 శాతం ఉన్న ఆదివాసీ గిరిజన ఎస్సీ, ఎస్టీ బ్లాకుల్లో ఏకలవ్య పాఠశాలలను కేంద్రం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇటు 2022లో కూడా 20 శాతం జనాభా ఉన్న బ్లాకుల్లో కూడా ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 728 పాఠశాలలు ప్రారంభించింది. ప్రస్తుతానికైతే 410 స్కూళ్లలో విద్యాబోధన కొనసాగుతుంది. 1.20 లక్షల మందికిపైగా విద్యార్థుల్లో ఆ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. భవన నిర్మాణాలకు రూ. 38 కోట్లు, అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ. 48 కోట్లు వెచ్చిస్తున్నాం’ అంటూ కేంద్రమంత్రి చెప్పారు.


ఇటు తెలంగాణలో మొత్తం 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని, అందులో 8,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజిన ప్రాంతాల్లోని విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చి దిద్దాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు. మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ యజ్ఞంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు.

Also Read: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

Related News

BRS vs Congress: బీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ బాయ్‌కాట్.. మంత్రి తుమ్మల ఫైర్..

Minister Komati reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే.. ఆ తప్పుకు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Student Denied Entry: గణేష్ మాల ధరించిన విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం

BRS MLAs Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..

Bhimeshwara Temple: చెప్పులతో ఆలయ ప్రవేశం.. అన్యమతస్తులపై భక్తులు ఆగ్రహం.. ఎక్కడ అంటే?

Big Stories

×