Hyderabad News: గంటపాటు వర్షం పడితే హైదరాబాద్‌లో నరకమే. ట్రాఫిక్ మాట గురించి చెప్పనక్కర్లేదు. వర్షం దాటికి రోడ్లు ఎక్కడ కూలుతాయోనన్న భయం నగర వాసులను వెంటాడుతోంది. నాసిరకం రోడ్డు కారణమా? వర్షం కారణమో తెలీదుగానీ రోడ్డు కుంగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ విరంచి ఆసుపత్రి సమీపంలోని ఓ రోడ్డు కూలింది. అదే సమయంలో వెళ్తున్న వాటర్ ట్యాంక్ దిగబడిపోయింది.
సోమవారం సాయత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని నలువైపులా కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిచి ముద్దైంది. వర్షం పడితే చెప్పాల్సిన అవసరం లేదు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆఫీసుల్లో జనరల్ షిఫ్ట్ డ్యూటీ దిగినవాళ్లు ఇంటికి వెళ్లడానికి నాలుగైదు గంటలు పట్టిందంటే ఈ రేంజ్‌లో వర్షం పడిందో అర్థమవుతోంది.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్ లో రోడ్డు కుంగిపోయింది. విరంచి ఆసుపత్రికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. వర్షానికి నాలాపై ఉన్న రోడ్డు దెబ్బతింది. రన్నింగ్ లో ఉన్నవాటర్ ట్యాంకర్ పడిపోయింది.అప్రమత్తమైన డ్రైవర్, అక్కడి నుంచి వాహనం నుంచి దూకి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ట్యాంకర్ ను బయటకు తీశారు జీహెచ్ఎంసీ అధికారులు.
మంగళవారం ఉదయం వేకువజామున ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. గడిచిన ఆరునెలలుగా హైదరాబాద్ సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో రోడ్లు వేసిన ప్రాంతాల్లో అవి కుంగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Also Read: కేసీఆర్-జగన్‌లకు పొంచివున్న గండం.. ఒకేసారి అరెస్ట్?
గతేడాది అక్టోబర్ 23న గోషామహల్-దారుసలామ్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి రోడ్డు కూలిపోయింది. అర్థరాత్రి ఆ ఘటన జరిగింది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నాలా పురాతనమైనదిగా స్థానికులు చెప్పారు. ఆ ఘటన తర్వాత కూతవేటు దూరంలో మరొక రోడ్డు కూలిపోయింది. ఇలా నగరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో వివిధ ప్రాంతాల వారు బెంబేలెత్తున్నారు. దీంతో కొన్ని రోడ్లు, డ్రైనేజీను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తోంది హైడ్రా.
బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి దగ్గర కుంగిన రోడ్డు, దిగబడిన వాటర్ ట్యాంకర్ pic.twitter.com/hglnlC9M0O
— BIG TV Breaking News (@bigtvtelugu) August 5, 2025