E-Paper
Advertisement

Parameswar Reddy : నేనే ఎమ్మెల్యే.. ఉప్పల్ లో గెలుపుపై పరమేశ్వర్ రెడ్డి ధీమా..

Parameswar Reddy : నేనే ఎమ్మెల్యే.. ఉప్పల్ లో గెలుపుపై  పరమేశ్వర్ రెడ్డి ధీమా..
Advertisement

Parameswar Reddy : గ్రేటర్ హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పరమేశ్వరరెడ్డి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ తిరుగుతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప్పల్ లో గెలిచేది తానేనని స్పష్టం చేస్తున్నారు.

ఉప్పల్‌పై కేసీఆర్‌ సర్కార్‌ సవతి ప్రేమ చూపిస్తోందని పరమేశ్వరరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడిందని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

Advertisement

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ డ్రైనేజీ సమస్య ఉందని పరమేశ్వరరెడ్డి వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఎన్నికల సమయంలోనే మాత్రం జీవోలు తీసుకువస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ కు ఉప్పల్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు.

సంక్షేమ పథకాలు సామాన్యులకు అందలేదని పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ను 6 గ్యారెంటీలే గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు.అయినా సరే కాంగ్రెస్‌కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Advertisement

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×