
Aadikeshava Trailer : వైష్ణవ్ తేజ్, శ్రీలీల కాంబోలో వస్తున్న మూవీ ఆదికేశవ. ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీ శ్రీకాంత్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతోంది. భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మరొక మూడు రోజులలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 24న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మూవీ ట్రైలర్ విడుదల రెండుసార్లుగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఆదికేశవ ట్రైలర్ విడుదల అయ్యింది.ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందో తెలుసా?
మొత్తానికి లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది అన్నట్లుగా..ఆదికేశవ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.టైలర్ మొదటి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య ఇంటెన్స్ లవ్ ట్రాక్ చూపించారు.ఇక ఆ తర్వాత మాస్ బీభత్సంతోపాటు ఊచ కోత చూపించారు.ప్రత్యర్థులను ఎదుర్కొనే హీరో మాస్ యాంగిల్ పీక్స్ లో ఉంది.
వైష్ణవ్ తేజ్ ఊర మాస్ పెర్ఫార్మెన్స్.. ఫైట్స్ గూస్ బంప్స్ జనరేట్ చేస్తున్నాయి. వైష్ణవ తేజ్ ను ఈ మూవీలో ఎన్నడూ చూడనంత డిఫరెంట్ గా చూపించారు అన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ మూవీపై ఆసక్తిని బాగా పెంచుతోంది.
ఇక ఇందులో శ్రీలీల మాంచి గ్లామర్ మోడ్ లో కనిపిస్తుంది. రీసెంట్ గా బాలయ్య.. భగవంత్ కేసరి తర్వాత..శ్రీలీలకు మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక నవంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఆదికేశవ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.