E-Paper
Advertisement

Khammam district: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. పేదల గూడుపై సర్కార్ ఉక్కుపాదం

Khammam district: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. పేదల గూడుపై సర్కార్ ఉక్కుపాదం
Advertisement

Khammam district: ఖమ్మం నగర శివారులోని వెలగుమట్ల వినోబా నగర్ ప్రాంతం నేడు యుద్ధభూమిని తలపిస్తోంది. ఎంతో కాలంగా నివాసముంటున్న పేదల ఇళ్లను భూదాన్ భూముల ఆక్రమణల సాకుతో ప్రభుత్వం కూల్చివేస్తోంది. ఈ ఆపరేషన్ కోసం ఏకంగా నాలుగు జిల్లాల నుండి వేల సంఖ్యలో పోలీసులను మోహరించడం గమనార్హం. తమ కష్టార్జితంతో, అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను కళ్లముందే నేలమట్టం చేస్తుంటే, బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఓటు వేసి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీరుమున్నీరవుతున్నారు.

మీడియాపై ఆంక్షలు – చీకటి ఆపరేషన్?
ఈ కూల్చివేత ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కవరేజ్ కోసం వెళ్తున్న మీడియా ప్రతినిధులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ జర్నలిస్టులను అనుమతించకపోవడం వెనుక ప్రభుత్వం చేస్తున్న అరాచకం బయటపడకూడదనే భయం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. వార్తలను నియంత్రించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక పోలీస్ రాజ్యమా? అని ఆయన ప్రశ్నించారు. “ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నమ్మబలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతోంది” అని ధ్వజమెత్తారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇలాంటి రాక్షస కాండకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. బాధితుల ఆవేదన రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయమని హెచ్చరించారు.

తిరగబడ్డ బాధితులు – ఉద్రిక్త వాతావరణం
తమ నివాసాలను కాపాడుకునేందుకు బాధితులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కాలనీ యువకులు కర్రలతో పోలీసులను ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. “రూపాయి రూపాయి పోగేసి గూడు కట్టుకుంటే, కనీసం సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జేసీబీలతో కూల్చేస్తారా?” అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలను ఆపి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: అక్రిడిటేషన్లలో డెస్క్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం

పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తక్షణమే కూల్చివేతలు ఆపి, బాధితులకు పునరావాసం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రతిపక్షం హెచ్చరించింది.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×