BigTV English

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియేట్ నిర్మాణం.. విజిలెన్స్ విచారణ, వామ్మో.. అన్ని కోట్ల అవినీతా?

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియేట్ నిర్మాణం.. విజిలెన్స్ విచారణ, వామ్మో.. అన్ని కోట్ల అవినీతా?

Telangana secretariat construction: తెలంగాణ సెక్రటేరియేట్ నిర్మాణానికి ఖర్చు ఎంత? అంచనాలను అప్పటి ప్రభుత్వం అమాంతంగా పెంచేసిందా? నిర్మాణానికి 1000 కోట్లు దాటేసిందా? ఐటీ సామాగ్రికి సైతం అదనంగా ఖర్చు చేసిందా? ఆ ఖర్చుని చూసి అధికారులు నోరెళ్లబెట్టారా? తాజాగా అందుకున్న సమాచారం మేరకు విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఓ వైపు కాళేశ్వరం.. ఇంకోవైపు విద్యుత్ కోనుగోళ్ల అంశం.. మరోవైపు వరంగల్ టిమ్స్ నిర్మాణంపై విచారణలు జరుగుతున్నాయి. ఈ జాబితాలోకి తెలంగాణ సెక్రటేరియేట్ చేరిపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలను బయటపెట్టింది. అవినీతిని ఎంత అందంగా చేయాలో గత ప్రభుత్వాన్ని చూస్తే తెలుస్తుందని పేర్కొంది. సచివాలయం నిర్మాణం రూ.617 కోట్ల అంచనా వేసి మొదలుపెట్టింది గత కేసీఆర్ సర్కార్. నిర్మాణం పూర్తి అయ్యేనాటికి దాన్ని అమాంతంగా పెంచేసింది. రూ.617 కోట్ల నుంచి 1,140 కోట్ల రూపాయల వరకు అంచనాలు పెంచి ఖర్చు చేసినట్టు ప్రస్తావించింది.


సెక్రటేరియేట్‌లో ఐటీ పరికరాల కొనుగోళ్ల కోసం తొలుత 181 కోట్ల రూపాయలు అంచనా వేసి దాన్ని 361 కోట్లకు పెంచినట్టు పేర్కొంది. అటు సచివాలయం నిర్మాణం కోసం అంచనాల కంటే ₹523 కోట్లు, ఐటీ పరికరాల కొనుగోలుకు అంచనాల కంటే ₹180 కోట్ల రూపాయల అధిక ఖర్చు చేసిందని ప్రస్తావించింది. ఈ భాగోతంపై విజిలెన్స్ నిగ్గు తేల్చనుంది.

ALSO READ:  అధికారులకు షాక్.. అడ్డుకున్న మూసీ ప్రాంతవాసులు

అవినీతి ఎన్ని రకాలుగా అవినీతి చేయవచ్చో ఆ పార్టీకి తెలుసని తెలిపింది. వారి అవినీతి అనుభవంతో అసంబద్ధ ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించింది. బీఆర్ఎస్ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు ప్రజా ప్రభుత్వంపై అసంబద్ధ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టింది. మరి విజిలెన్స్ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×