Jubilee Hill Bypoll: రాజకీయాల్లో శాశ్వత శత్రవులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఎటు వైపు వుంటారో తెలియని పరిస్థితి నేటి రాజకీయాలు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోకుంటే ఆయా నేతల పొలిటికల్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టే. తాజాగా కవితతో భేటీలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డితో అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ బైపోల్‌పై విష్ణు నుంచి వివరణ తీసుకున్నారు కవిత.
కేటీఆర్‌తోనే తన ప్రయాణం ఉంటుందని విష్ణువర్ధన్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. తాను ఎప్పుడు చెప్పినా ఇదేనని అన్నారట. కేటీఆర్‌తోపాటు తనకు ప్రమోషన్ ఉంటుందని అన్నట్లు సమాచారం. విష్ణు తన వెర్షన్‌ని బయటపెట్టాడు. మరి కవిత మనసులో ఏముంది?
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు కవితను ఆహ్వానించానని చెప్పారు విష్ణు. వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశానని పేర్కొన్నారు. ఈ ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకుని నిత్యం వార్తల్లో ఉండేందుకు కవిత ఈ తరహా స్కెచ్ వేశారని అంటున్నారు.
ALSO READ: కవితతో మాజీ ఎమ్మెల్యే విష్ణు భేటీ, మేటరేంటి?
త్వరలో బతుకమ్మ సంబరాల సందర్భంగా కవిత తన పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో పలు జిల్లాలను చక్కబెట్టారు కవిత. అదే సమయంలో బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా.
రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగనుంది. ఈలోపు ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు ఉచ్చుబిగుసుకోవడం ఖాయమని వార్తలు లేకపోలేదు. ఆ వ్యవహారం స్థానిక సంస్థలకు ముందే రావచ్చని కొందరి మాట. అదే జరిగితే కవిత లైమ్ లైట్‌లోకి రావడం ఖాయమని బీఆర్ఎస్‌లో మరో వర్గం నుంచి వినిపిస్తున్న మాట.