E-Paper
Advertisement

Vishnuvardhan Reddy : విష్ణువర్ధన్ రెడ్డితో హరీష్ రావు భేటీ.. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరిక!

Telangana elections | తెలంగాణ ప్రజా నాయకుడు పిజేఆర్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి (P Vishnuvardhan Reddy)తో బీఆర్‌ఎస్ మంత్రి హరీష్‌రావు ( Harish Rao) కలిశారు. సోమవారం ఉదయం విష్ణు ఇంటికి హరీష్ రావు స్వయంగా వెళ్లి భేటీ అయ్యారు. త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి చేరే అవకాశం ఉంది.

Vishnuvardhan Reddy : విష్ణువర్ధన్ రెడ్డితో  హరీష్ రావు భేటీ.. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరిక!

Vishnuvardhan Reddy | తెలంగాణ ప్రజా నాయకుడు పిజేఆర్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి (P Vishnuvardhan Reddy)తో బీఆర్‌ఎస్ మంత్రి హరీష్‌రావు ( Harish Rao) కలిశారు. సోమవారం ఉదయం విష్ణు ఇంటికి హరీష్ రావు స్వయంగా వెళ్లి భేటీ అయ్యారు. త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి చేరే అవకాశం ఉంది.

విష్ణువర్ధన్ రెడ్డిని కలిసిన తరువాత మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ”కాంగ్రెస్ పార్టీలో విష్ణుకు జరిగిన అవమానంతో చాలా బాధపడ్డాను. విష్ణు తనతో కలిసి అయిదేళ్లు అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌లో చేరాలని విష్ణుని కోరాను. ఆయన కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఎన్నికల టికెట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. పట్టపగలు డబ్బుల కట్టలతో దొరికారు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుతుగున్న పోటీ”, అని ఆయన చెప్పారు.

ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విష్ణువర్ధన్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆయనను బీఆర్‌ఎస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

కాంగ్రెస్ తరపున విష్ణవర్ధన్ రెడ్డి జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన రెండో అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఆ టికెట్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు కాంగ్రెస్ కేటాయించింది. ఆ కారణంగా శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్‌లో విష్ణు అనుచరులు ఆందోళన చేశారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×