BigTV English

Fire accident: విక్టిమ్ లొకేషన్ కెమెరా-VLC అంటే ఏంటి? డెక్కన్ మాల్ లో డెడ్ బాడీలు గుర్తించారా?

Fire accident: విక్టిమ్ లొకేషన్ కెమెరా-VLC అంటే ఏంటి? డెక్కన్ మాల్ లో డెడ్ బాడీలు గుర్తించారా?

Fire accident: డెక్కన్ మాల్ అగ్నికీలల్లో మొత్తం కాలిపోయింది. లోపలున్న మెటీరియల్ మొత్తం మండిపోయింది. ఆ మంటల తీవ్రతకు బిల్డింగ్ పిల్లర్లు, స్లాబులు కూడా కరిగిపోయాయి. ఆ బిల్డింగ్ లో ముగ్గురు చిక్కుకుపోగా.. వారంతా మరణించి ఉంటారని అధికారులు భావించారు. కనీసం వారి డెడ్ బాడీలన్నా గుర్తిద్దామంటే.. భవనం లోనికి పోలేని పరిస్థితి. ఇంకా వేడి తగ్గకపోవడం.. భవనం పూర్తిగా డ్యామేజ్ కావడంతో.. ఎప్పుడు కుప్పకూలిపోతుందో అనే భయం. అందుకే, బిల్డింగ్ లోపల పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ ను ఉపయోగించారు. అయితే, డ్రోన్ ను బిల్డింగ్ మొత్తం తిప్పినా.. ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. లోపలంతా నల్లగా, చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించలేదు. దీంతో.. మరో ప్రయత్నంగా VLCని తీసుకొచ్చారు. ఇంతకీ VLC అంటే ఏంటి?


విక్టిమ్ లొకేషన్ కెమెరా-VLC. ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నా, ప్రమాదవశాత్తూ చిన్నారులు బోరుబావిలో పడినా.. వారి ఆనవాళ్లు గుర్తించేందుకు విక్టిమ్ లొకేషన్ కెమెరాను వాడుతారు. చూట్టానికి పొడువైన వెపన్ మాదిరి కనిపిస్తుంది. VLCలో కెమెరాతో కూడిన రాడ్, కంట్రోల్ మాడ్యూల్ ఉంటుంది. టెలిస్కోపిక్ రాడ్ ను 9 ఫీట్ల వరకు పొడగించవచ్చు. రాడ్ అంచున కెమెరాతో పాటు ఎల్ఈడీ లైట్లు ఉండటంతో చీకట్లో విక్టిమ్ ను గుర్తించవచ్చు. కెమెరాను 360 డిగ్రీల్లో రొటేట్ చేయొచ్చు. రాడ్ కు వైర్ ను అటాచ్ చేసి.. బోరు బావిలాంటి లోతైన ప్రదేశాల్లో గాలింపు కోసం మార్చుకోవచ్చు.

కెమెరా చుట్టూ ఎల్ఈడీ లైట్లతో పాటు ఓ స్పీకర్ కూడా ఉంటుంది. శిథిలాల్లో చిక్కుకున్న బాధితులు చేసే చిన్న చిన్న శబ్దాలను కూడా ఆ స్పీకర్ పసిగట్టగలదు. విక్టిమ్ బ్రీతింగ్ ను సైతం రికార్డు చేయగలుగుతుంది. అదే స్పీకర్ తో బాధితులకు మన మాటల్ని, సూచనల్ని వినిపించవచ్చు. మరోవైపు, కంట్రోల్ మాడ్యూల్ లోని మానిటర్ ద్వారా బాధితులు ఎలా ఉన్నారో చూడొచ్చు. ఇలాంటి అత్యాధునిక VLC పరికరంతో డెక్కన్ మాల్ లో పరిశీలించినా.. మృతదేహాల జాడ మాత్రం కనిపించలేదు.


Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×