BigTV English

Amusement Park: టూరిస్టులు ఉల్టాపల్టా.. పెండ్యులం రాడ్ విరిగి ప్రమాదం..

Amusement Park: టూరిస్టులు ఉల్టాపల్టా.. పెండ్యులం రాడ్ విరిగి ప్రమాదం..

Amusement Park: వారం రోజులు ఆఫీస్ వర్క్, వ్యాపారాల్లో బిజీగా ఉండే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం టూరిస్ట్ ప్రాంతాలకు, పార్క్‌లకు వెళ్తుంటారు. ఇలా ఎంజాయ్ చేద్దామని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లిన టూరిస్టులకు ఊహించని షాక్ తగిలింది. పార్క్‌లో పెండ్యులంపై రైడ్ చేస్తున్న క్రమంలో రాడ్ విరిగిపోయి అంతా తలక్రిందులుగా వేలాడారు. ఈ ఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో జరిగింది.


చైనాలోని ఫుయాంగ్ నగరంలోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లారు. ఈక్రమంలో కొందరు పర్యాటకులు పెండ్యులం రైడ్ చేస్తుండగా ఒక్కసారిగా మధ్యలో ఉండే పెద్ద రాడ్ విరిగిపోయింది. దీంతో దానిపై ఉన్న టూరిస్టులంతా తలక్రిందులుగా వేలాడారు. దాదాపు 10 నిమిషాల పాటు తలక్రిందులుగానే ఉండి భయంతో అరుపులు, కేకలు పెట్టారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రాడ్ పైభాగానికి వెళ్లి సరిచేయడంతో అందరూ సురక్షితంగా కిందికి దిగారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే పరిమితికి మించి ఎక్కువ మందిని పెండ్యులంపైకి ఎక్కించడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.


Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×