E-Paper
Advertisement

మందుబాబులకు యుద్ధం సెగ.. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్, సమ్మర్‌‌ వేళ జేబుకు చిల్లు?

మందుబాబులకు యుద్ధం సెగ.. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్, సమ్మర్‌‌ వేళ జేబుకు చిల్లు?
Advertisement

Telangana: ఇరాన్ యుద్ధం ప్రభావం అన్నిరంగాలపై క్రమంగా పడుతోంది. దేశంలోని రకరకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలో ఊహించని షాక్ తగలనుంది. వచ్చే నెల అంటే మే నుంచి మద్యం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.

యుద్ధం సెగ మందుబాబులకు తగిలింది

Advertisement

పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి.  ముఖ్యంగా హోర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. కేవలం చమురుకు మాత్రమే కాదు.. వివిధ రంగాలపై దాని ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతింది.

దాని మీద ఆధారపడిన రకరకాల ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. అందులో మద్యం సీసాలు కూడా ఒకటి. వాటి  ఉత్పత్తి ఖర్చులు అమాంతంగా పెరిగాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు మొదలయ్యాయి. దీని కారణంగా దేశంలో గాజు సీసాల ఉత్పత్తి 40 శాతం వరకు పడిపోయింది. ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి.

Advertisement

తెలంగాణలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్? కమిటీ నివేదిక కోసం

అదనపు భారాన్ని భరించలేమని ధరలను పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కొద్దిరోజుల కిందట ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించాయి. ఇక తెలంగాణలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ప్రతి రెండేళ్లు ఒకసారి మద్యం ధరలను ప్రభుత్వం సమీక్షిస్తుంది.

2023 మే నెలలో ధరలను పెంచారు. దాని ప్రకారం గతేడాది మే నెలలో ధరలను సమీక్షించాల్సి ఉంది. ఆ గడువు ఎప్పుడో ముగిసింది. పరిశ్రమ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు తయారీ దారుల విజ్ఞప్తితో ప్రభుత్వం ధరల పెంపుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేసేందుకు ఓ జ్యుడీషియల్ కమిటీని ప్రభుత్వం నియమించింది.

ALSO READ: ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. బాసర క్షేత్రానికి నూతన వైభవం, రూ. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం!

బాటిల్ సైజ్, బ్రాండ్ రేంజ్, ట్యాక్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరల పెంపుపై ఏప్రిల్ చివరినాటికి ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ లెక్కన తెలంగాణలో మద్యం ధరల పెరగడం ఖాయమని అంటున్నారు. గతేడాది 15 శాతం ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం ధరలు పెరగడంతో కంపెనీలు పెంపును కోరుతున్నాయి. వేసవికాలం కావడంతో బీర్లకు మాంచి డిమాండ్ నెలకొంది.

డిమాండ్ పెరుగుతుండగా సరఫరా తగ్గడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా మే నెలలో మద్యం ధరలు పెరగడం ఖాయమని చర్చించినట్టు కుంటున్కొంనారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఆ శాఖ చెబుతున్నమాట. మొత్తానికి ఇరాన్ యుద్ధం కాదు చివరకు మందుబాబుల జేబులకు చిల్లు పడడం ఖాయం.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×