BigTV English

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

CM Revanth :


⦿ విద్యా వ్యవస్థను సమూలంగా మర్చేస్తున్నాం
⦿ పాఠశాలలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం
⦿ కేసీఆర్ పాలనలో అంతా నిర్లక్ష్యమే
⦿ రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడొద్దు
⦿ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి
⦿ డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై విద్యార్థుల హర్షం

హైదరాబాద్, స్వేచ్ఛ : ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు ఈమధ్య డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వచ్చారు విద్యార్థులు. డైట్, కాస్మోటిక్ చార్జీల‌ను పెంచిన నేపథ్యంలో థాంక్యూ సీఎం సార్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు సీఎం. సొంత హాస్టల్ భవనం నిర్మించాలని వారు కోరగా, స్థానిక అధికారులతో స్థల సేకరణ చేయించిన అనంతరం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్న రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.


స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్న ఆయన, యువజన సంఘాలు బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలని చెప్పారు. స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించాలని, ఇది యువతరంపై ఉన్న అతి పెద్ద బాధ్యతగా చెప్పారు. యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరం, అలాంటి వ్యసనాల బారిన పడొద్దని సూచనలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దన్నారు. విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమేనని, చదువుకున్న వారు ప్రయోజకులు అవుతారని తెలిపారు. సామాజిక స్పృహతో సమాజానికి సేవచేసే వారు సమాజంలో హీరోలు అవుతారన్న రేవంత్ రెడ్డి, పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలని, ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులతో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ALSO READ : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

 

Related News

Mahesh Kumar Goud: తెలంగాణలో దొంగ ఓట్లు.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన కామెంట్స్!

Telangana Govt: వినాయక చవితి పండుగకు.. తెలంగాణ ప్రభుత్వ సూపర్ గిఫ్ట్.. మీకు తెలుసా!

Shamshabad Airport: సాంకేతిక లోపంతో విమానం రన్‌వేపై చక్కర్లు.. 37 మంది ఆందోళన

Rain Alert: బ్రేక్ ఇచ్చిన రెయిన్.. నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు..

Ganesha lorry stuck: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..

CM Progress Report: యూరియా కొరతకు చెక్..! సీఎం ప్లాన్ ఏంటంటే..?

Big Stories

×