BigTV English

Bloody Beggar Trailer: బ్లడీ బెగ్గర్.. బకరా ఎలా అయ్యాడు.. ?

Bloody Beggar Trailer: బ్లడీ బెగ్గర్.. బకరా ఎలా అయ్యాడు.. ?

Bloody Beggar Trailer:  ఒరిజినల్ సినిమాలు.. డబ్బింగ్ సినిమాలు అనే తేడా తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడు  ఉండదు. ఏ భాష నుంచి మంచి కథ వచ్చినా  ఆదరించడమే తెలుగు ప్రేక్షకులకు  తెలుసు.  అమరన్ విజయమే అందుకు నిదర్శనం.   గతవారం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక వచ్చేవారం.. మరో డబ్బింగ్ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదా అనే సినిమాతో తెలుగువారికి దగ్గరయిన హీరో కెవిన్. ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాకపోయినా.. ఓటీటీలో దాదా సినిమాకు  సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.


ఇక తెలుగులో ఈ మధ్యనే స్టార్ అనే సినిమాతో వచ్చాడు. అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదు. ఈ రెండు సినిమాలు కాకుండా తాజాగా కెవిన్ నటిస్తున్న చిత్రం బ్లడీ బెగ్గర్. శివబాలన్  ముత్తు కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Film Stars: అత్యధికంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే..!


పాత్ర కోసం కెవిన్ ఎలా అయినా మారిపోతాడని స్టార్, బ్లడీ బెగ్గర్ సినిమాలు రుజువు చేశాయి. నవంబర్ 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మెలర్స్ . తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి.. ఇదొక కామెడీ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. సమాజంలో బెగ్గర్స్ ఎలా ఉంటారు.. ? అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఈజీగా ఎలాంటి పని చేయకుండా డబ్బులు సంపాదించడం కోసం..  కళ్లు పోయాయని, కాళ్లు లేవని అబద్దాలు చెప్తూ  అడుక్కునే బెగ్గర్ హీరో. నిత్యం అతని పని.. సిగ్నల్స్ దగ్గర, గుడి దగ్గర అడుక్కోవడమే. అలా  ఎలాంటి కష్టం లేకుండా బతుకుతున్న హీరోకు.. ఒక కోట లాంటి ఇల్లు కనిపిస్తుంది. ఆ కోటలోకి అడుగుపెట్టాలని చూస్తాడు. అయితే బయట కనిపించే బంగారం లాంటి కోట.. బంగారం కాదని, అతన్ని బకరాను చేయడానికి వేసిన ఎత్తుగడ అని తెలుసుకుంటాడు.

Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి

ఆ కోటలో నివసించే కొందరు.. ఆస్తికోసం బెగ్గర్ ను వారసుడును చేస్తారు. రూ. 300 కోట్ల ఆస్తికి వారసుడిగా బెగ్గర్ ఏం చేశాడు .. ? ఎవరి చేతిలో బకరా అయ్యాడు.. ? అసలు ఆ కోట ఎవరిది.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బెగ్గర్ గా కెవిన్ లుక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కోటలోనే సగం సినిమా ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక నవంబర్ 8 న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×