BigTV English

Kavitha : నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది..!

Kavitha : నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది..!

Kavitha : అనుకున్నట్టే అయింది. కవిత బ్లాస్ట్ అయ్యారు. కేటీఆర్ పేరు ఎత్తకుండా అన్నను కుమ్మి పడేశారు. పార్టీలో రచ్చంతా బయటపెట్టారు. ఇంటి గుట్టును రోడ్డున పడేశారు. టైమ్ చూసి కేటీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కవిత.


అమెరికా అచ్చి రాలేదా?

గత వారం కవిత అమెరికాలో ఉన్నప్పుడు.. తండ్రికి కూతురు రాసిన లేఖ లీక్ అయింది. అది కేటీఆర్ పనే అనే అనుమానం వ్యక్తమైంది. విదేశాల నుంచి రాగానే.. కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయంటూ కవిత ఇచ్చిపడేసింది. ఇప్పుడు సేమ్ టు సేమ్.. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే కవిత చిట్‌చాట్ పేరుతో అన్నకు ఖతర్నాక్ షాక్ ఇచ్చారు. టిట్ ఫర్ టాట్‌లా దెబ్బ కొట్టారని అంటున్నారు.


కవిత మాస్ వార్నింగ్

కవిత అంతా ఓపెన్‌గా చెప్పేశారు. తాను కేటీఆర్ నాయకత్వంలో పని చేయనని.. తన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని చెప్పకనే చెప్పేశారు. ఇంటి ఆడబిడ్డపైనే కుట్ర చేస్తారా? అంటూ గరం అయ్యారు. పెయిడ్ ఛానెల్స్‌తో తనను బ్లేమ్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్‌తో టచ్‌లో లేనని స్పష్టం చేశారు. తానేమీ పార్టీకి వెన్నుపోటు పొడవడం లేదని.. డైరెక్ట్‌గానే పోరాడుతానని తేల్చి చెప్పారు. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు.. కొత్త పార్టీ ఎందుకు? అంటూ కవిత సొంత పార్టీ పెడుతున్నారనే ప్రచారానికి బ్రేకులు వేశారు. తాను కూడా కేసీఆర్ లాగా చాలా తిక్కదాన్ని అని.. ఎవరికీ భయపడనని.. తన జోలికొస్తే బాగుండదంటూ.. అల్టిమేటం జారీ చేశారు కవిత. తాను అసలే మంచిదాన్ని కాదని.. నోరు తెరిస్తే బాగోదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఆనాటి తెలంగాణ తల్లి కవితేనా?

మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ సైతం చేశారు కవిత. తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలు మార్చినప్పుడు ఎందుకు పార్టీ నాయకులు మాట్లాడలేదని ప్రశ్నించారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కవిత ఫేస్ లానే ఉండేదని అనేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. విగ్రహానికి కిరీటం గట్రా తీసేయాలని భావించి.. తెలంగాణ తనం కొట్టొచ్చేలా కొత్త విగ్రహం తయారు చేయించారు. తనలానే ఉండే తెలంగాణ తల్లి మారిపోవడంతో కవిత బాగా హర్ట్ అయినట్టున్నారు. ఆ అక్కసు ఇప్పుడు బయటపెట్టారని అంటున్నారు. విగ్రహం మారిస్తే పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదంటూ తన బాధ వ్యక్తం చేశారని చెబుతున్నారు.

కవితను ఓడించింది ఎవరంటే..

గతంలో తాను ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడించారని కవిత అన్నారు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పోరాడానని గుర్తు చేశారు. పార్టీ చేయని కార్యక్రమాలను తాను తెలంగాణ జాగృతి తరఫున చేస్తున్నానని.. తనది ఉద్యమ సంస్థ అని చెప్పారు. తనను, కేసీఆర్‌ను విడదీసే కుట్ర చేస్తున్నారని.. అలా చేస్తే ఎవరికి లాభమో ఆలోచించుకోవాలంటూ పరోక్షంగా కేటీఆర్‌నే కవిత టార్గెట్ చేశారని అంటున్నారు. బీఆర్ఎస్‌ వజ్రోత్సవం మీటింగ్ సక్సెస్‌ చేసింది కేసీఆర్ మాత్రమేనంటూ క్రెడిట్ అంతా తండ్రికే కట్టబెట్టారు. తాను రాసిన లేఖలో తప్పేమీ లేదంటూ అటాకింగ్ మోడ్‌లోకి వచ్చేశారు.

Also Read : కవితకు షోకాజ్ నోటీసులు? ఖేల్ ఖతం!

కవిత ఎజెండా ఇదే..

ఇటీవల కవిత సామాజిక తెలంగాణ నినాదం అందుకున్నారు. అంటే దొరల పాలనను వ్యతిరేకించినట్టేగా? అంటున్నారు. ఆ స్టోగన్ కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకేనని అన్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. సామాజిక తెలంగాణ బీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కొంత జరిగిందని.. భవిష్యత్‌లో మరింత జరుగుతుందని అనుకుంటున్నానని తన ఎజెండాను బలపరుచుకున్నారు కవిత. ఇలా కవిత చేసిన ప్రతీ కామెంట్ వెనుక ఆమె తిక్కతో పాటు ఓ లెక్క కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×