Viral Video: బాహుబలి ఎంతటి బలవంతుడో వెండితెరపై కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ రాజమౌళి. టెక్ యుగంలో అలాంటి మనుషులు లేకున్నా, కొన్ని జంతువులు మాత్రం ఉన్నాయి. సరిగ్గా అలాంటిది ఈ ఏనుగు. కనిపిస్తున్న ఈ గజరాజు ప్రస్తుతం సోషల్ మీడియాతో తుపాను సృష్టిస్తోంది. అసలు మేటరేంటి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో బాహుబలి ఏనుగు దర్శన మిచ్చింది. తిరువేగప్పుర గ్రామంలో ఆ ఏనుగు ఫీట్లు చూసి షాకవుతున్నారు జంతు ప్రేమికులు. నిమిషాల వ్యవధిలో 2 వేల పైచిలుకు బరువున్న వాహనాన్ని బయటకు తీసుకురావడం దీని వెనుకున్న సారాంశం. ఇందులో విశేషం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
తిరువేగప్పుర గ్రామంలోని స్థానిక నదిలో చిక్కుకుంది టయోటా ఫార్చ్యూనర్ SUV కారు. దీన్ని ఎలాగ బయటకు తీసుకు రావాలని కారు ఓనర్ నానా ప్రయత్నాలు చేశాడు. ఓ వైపు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఒడ్డుకు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి తన ఏనుగును తీసుకొచ్చాడు. అదే సమయంలో కారును తాళ్లతో కట్టి వాటిని బాహుబలి ఏనుగుకు అందించాడు.
కారు ముందు భాగంలో ఉన్న హుక్ నుండి ఒక తాడును ఏనుగుకు కట్టారు. ఆ తర్వాత ఆ ఏనుగు తన తొండంతో తాడును పట్టుకుని లాగింది. ఇంకేముంది నిమిషాల వ్యవధిలో దాదాపు 2,105 కిలోల నుండి 2,135 కిలోల బరువున్న ఆ కారుని బయటకు తీసింది. ఈ సన్నివేశాన్ని స్థానిక వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాలో షూట్ చేశాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఏనుగు వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ALSO READ: బెంగుళూరులో రాత్రివేళ.. సన్ రూఫ్‌పై రెచ్చిపోయిన జంట
ఏనుగు తన బలాన్ని ప్రశంసించినప్పటికీ రెస్క్యూ వాహనానికి బదులుగా జంతువును ఉపయోగించడాన్ని ఓ ఒక్కరూ ప్రశ్నించలేదు. పైగా బాహుబలి ఏనుగు అంటూ రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు నెటిజన్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల మంది వీక్షించారు. లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇది హార్స్ పవర్ కాదు.. ఏనుగు శక్తి అంటూ రకరకాలుగా తమ అభిప్రాయాన్ని బయటపెడుతున్నారు.
India: Elephant Pulls Out Stuck Toyota Fortuner In Kerala. pic.twitter.com/ywhaJfg6oy
— Imtiaz Mahmood (@ImtiazMadmood) May 28, 2025