CM Revanth Japan Tour: తెలంగాణ రైజింగ్ టీమ్ జపాన్ పర్యటనను వ్యూహాత్మకంగా ఎంచుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీబిజీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. భారీగా పెట్టుబడులు రాబడుతున్నారు. టోక్యో నుంచి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చాలా నేర్చుకున్నామన్నారు. జపాన్ ను చూసి ఏం నేర్చుకోవచ్చు.. మన హైదరాబాద్‌కు టోక్యో నుంచి ప్రేరణగా తీసుకునే అంశాలేమున్నాయి? ఏ లక్ష్యంతో సీఎం రేవంత్ జపాన్ పర్యటన ఎంచుకున్నారు?
టెక్ ఇన్నోవేషన్
స్టార్టప్ హబ్
ఏఐ, రోబోటిక్స్
అడ్వాన్స్ డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్
బెటర్ ఎన్విరాన్ మెంట్..
సాంస్కృతిక సమ్మేళనం..
ఇవన్నీ కలిస్తే టోక్యో..
ఇవన్నీ కలిస్తే టోక్యో.. అవును సరికొత్త ప్రపంచానికి అద్భుతమైన, అత్యాధునికమైన, చారిత్రక, వారసత్వ స్పూర్తి రగిల్చేలా నిలుస్తోంది టోక్యో. సో ఇక్కడ సీఎం రేవంత్ పర్యటన ద్వారా చాలా వరకు మన దగ్గర ఇంప్లిమెంట్ చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ పర్యటనతో చాలా టేక్ అవేస్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం.
జపాన్ మోడల్ ఎందుకు ఫాలో అవ్వాలి?
హైదరాబాద్ లో అభివృద్ధి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైంది మూసీ పునరుజ్జీవం. అన్ని ప్రధాన నగరాల్లో సిటీ మధ్య నుంచి నదులు వెళ్తున్నాయి. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో రివర్ ఫ్రంట్ లు, వాటర్ పార్క్ లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన దగ్గర మాత్రం మూసీ దగ్గరికి వెళ్తేనే కంపు కొట్టే పరిస్థితి. సిటీ మధ్యలో దుర్గంధం. దేశ విదేశీ పర్యాటకులు వస్తే ఒక మురికి కూపంగా కనిపిస్తున్న పరిస్థితి. దీన్ని ఎలాగైనా బాగు చేద్దామని రేవంత్ ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. సిటీ మధ్యలో ఫీల్ గుడ్ ఎన్విరాన్ మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రేవంత్ ఏ దేశం పర్యటనకు వెళ్లినా ఇలాంటి నదులను పరిశీలించి వచ్చారు. గతంలో సియోల్, లండన్ లో ఎలా తీర్చిదిద్దారో పరిశీలించారు.
తాజా పర్యటనలో టోక్యో వాటర్ ఫ్రంట్ స్టడీ
తాజాగా జపాన్ పర్యటనలో టోక్యో వాటర్ ఫ్రంట్‌ను సీఎం రేవంత్ టీమ్ సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నదిని రివర్ ఫ్రంట్‌గా ఎలా అభివృద్ధి చేశారో పరిశీలించారు. పర్యాటకులను ఎలా ఆకర్షిస్తోందో బోట్ లో వెళ్లి స్వయంగా చూశారు. టోక్యో సిటీ మధ్య నుంచి సుమిదా రివర్ లో జల రవాణాకు తగ్గట్లుగా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం, నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు.
సుమిదా నది రివర్ ఫ్రంట్ పై పరిశీలన
దీంతో టోక్యో సిటీ రూపురేఖలే మారిపోయాయి. ఈ నదికి రెండువైపులా అద్భుతమైన వాతావరణం సందర్శకులను ఆకర్షిస్తున్న పరిస్థితిని గమనించారు. సో ఇలాంటి టెక్నిక్స్ మన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో ఇంప్లిమెంట్ చేసేలా నోట్ చేసుకున్నారు. అందమైన, ఆహ్లాదమైన, స్వచ్ఛమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కీలక పాత్ర అని, అందుకోసమే తన తాపత్రయం అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మారిన మూసీని చూపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
టోక్యో మెట్రో పకడ్బందీ నిర్వహణ మరో స్పూర్తి
టోక్యో సుమిదా నది నుంచి మూసీ పునరుజ్జీవం ప్రేరణగా తీసుకోవడం ఒకటైతే.. టోక్యో మెట్రో మరో ఇన్ స్పిరేషన్. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ టోక్యో మెట్రోను కూడా సందర్శించింది. తొమ్మిది లైన్లతో సమర్థవంతంగా టోక్యో మెట్రోను ఆపరేట్ చేస్తున్నారు. అడ్వాన్స్ డ్ యాక్షన్ ప్లాన్, కెపాసిటీ, లేటెస్ట్ టెక్నాలజీ వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతమైన సేవలను ఎలా అందిస్తోందో ఆ మెథడ్స్ ను స్టడీ చేశారు. మన దగ్గర హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను స్టడీ చేసే క్రమంలో సీఎం బృందం టోక్యో మెట్రోను సందర్శించింది. సో ఆ విధానాలను మన దగ్గర సెకండ్ ఫేజ్ లో ఇంప్లిమెంట్ చేస్తే హైదరాబాదీలకు చాలా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అడ్వాన్స్ డ్ గా ఉంటుందంటున్నారు.
జపాన్ నుంచి ప్రపంచాన్ని శాసించే కంపెనీలు ఆపరేట్
జపాన్ దేశం చిన్నదే అయినా.. టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ డ్. పర్యావరణం, సాంస్కృతికం, సమర్థమైన ప్రజారవాణా, డిజాస్టర్ మేనేజ్ మెంట్, టెక్ ఇన్నోవేషన్స్, వేస్ట్ మేనేజ్ మెంట్ ఇవన్నిటిలో చాలా అడ్వాన్స్ డ్ గా ఉంది. చిన్న దేశమే అయినా ప్రపంచాన్ని శాసించే కంపెనీలు జపాన్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ అనే కంపెనీ ఓకే చెప్పింది. మరుబెనీ కంపెనీ మొదట వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.
నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ కు మరుబెనీ రెడీ
దీని ద్వారా 5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే ఈ పార్క్ తో తెలంగాణలో సుమారు 30వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. మరుబెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. సో ఈ కంపెనీ ఆలోచల నుంచి నెక్ట్స్ జెనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫ్యూచర్ సిటీలో రాబోతోంది. అంటే చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటుందన్న మాట. ఇదో కీ టేక్ అవే.
ఈనెల 22 వరకు జపాన్ లో సీఎం రేవంత్ పర్యటన
ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు సీఎం రేవంత్ పర్యటన జపాన్ లో కొనసాగబోతోంది. ఇందులో భాగంగా టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా తదితర నగరాల్లో షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటన సాగుతున్నా.. చాలా అంశాలను మన దగ్గర ఇంప్లిమెంట్ చేసుకునే వీలు కూడా కలుగుతోంది. అందుకే జపాన్ లో వారం పాటు పర్యటన పెట్టుకున్నారు సీఎం. తన పరిశీలన తర్వాత టోక్యో నగరం స్పెషాలిటీ, ఇక్కడి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు సీఎం. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. అంతే కాదు.. టెక్ సిటీ ఒసాకాలో కీలకంగా నిర్వహించే ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణ పెవిలియన్‌ను కూడా ప్రారంభించి పెట్టుబడులను మరింతగా ఆకర్షించబోతున్నారు.
సీఎం రేవంత్ జపాన్ పర్యటనను ఎంచుకున్నారు
జపాన్ డెవలప్ మెంట్ మోడల్ నుంచి తెలంగాణ చాలా అంశాలను నేర్చుకుని ఫాలో అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడి బెటర్ ప్రాక్టీసెస్ ను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. జపాన్‌లోని టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా వంటి ప్రాంతాల నుంచి ప్రేరణ తీసుకొని తెలంగాణ కోసం కొన్ని ముఖ్యమైన వ్యూహాల రచించే క్రమంలో సీఎం రేవంత్ జపాన్ పర్యటనను ఎంచుకున్నారు. అవేంటో చూద్దాం.
టోక్యోలో నెక్ట్ జెనరేషన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్
జపాన్, అందులోని నగరాలు చాలా రంగాల్లో ఇతర ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా టోక్యో. ఇక్కడ నెక్ట్స్ జెనరేషన్ అడ్వాన్స్ డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ఉంది. సబ్‌వే వ్యవస్థలు, సమయపాలన, సౌలభ్యం, కెపాసిటీలో బెటర్. ఇతర నగరాలు ఈ వ్యవస్థ నుంచి కోఆర్డినేషన్, మేనేజ్ మెంట్ ను నేర్చుకోవచ్చు. అంతే కాదు.. టోక్యోలో అధిక జనసాంద్రత ఉన్నప్పటికీ, ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. కాంపాక్ట్ డిజైన్‌లు, బహుళ ప్రయోజన భవనాలు ఇతర నగరాలకు ఆదర్శం.
టోక్యో స్మార్ట్ సిటీ టెక్నాలజీ, రోబోటిక్స్, AI కీలకం
పర్యావరణ స్థిరత్వం విషయంలో రీసైక్లింగ్, గ్రీన్ స్పేస్ అభివృద్ధిలో ముందంజలో ఉంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో భాగంగా భూకంపాలు, తుఫానుల వంటి సహజ విపత్తులు వచ్చినప్పుడు రెడీనెస్, బిల్డింగ్ నిర్మాణ ప్రమాణాలు, అలారం సిస్టమ్స్ నుంచి ఫాలో అవ్వొచ్చు. అంతే కాదు.. టోక్యో వాసుల సమయపాలన, పరిశుభ్రత, ప్రజా రవాణా ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. ఇక అన్నిటికంటే బెటర్ గా టోక్యో స్మార్ట్ సిటీ టెక్నాలజీ, రోబోటిక్స్, AI వినియోగం ఇతర నగరాలకు భవిష్యత్ సిటీ మోడల్స్ ను అందిస్తోంది.
మౌంట్ ఫ్యూజీ నుంచి ఎన్విరాన్ మెంట్ పాఠాలు
సీఎం రేవంత్ పర్యటనలో మౌంట్ ఫ్యూజీ కూడా ఉంది. ఇక్కడి పరిసరాలు, ఈ ఏరియా మేనేజ్ మెంట్ నుంచి కూడా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మౌంట్ ఫ్యూజీ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. దీని పరిరక్షణ కోసం జపాన్ ఫాలో అయ్యే కఠినమైన విధానాలను అన్ని దేశాలు అడాప్ట్ చేసుకోవచ్చు. తమ సహజ స్థలాలను రక్షించడానికి ఫాలో కావొచ్చు. పర్యాటకులను విపరీతంగా ఆకర్షించినా చాలా పరిమితంగా అనుమతించడం ద్వారా సేఫ్టీ చూసుకుంటోంది. మౌంట్ ఫ్యూజీ చుట్టూ ఉన్న నగరాలు ఫ్యూజినోమియా, గోటెంబా పర్యావరణంతో సమతుల్యతను కాపాడుతూ అభివృద్ధి చెందాయి. మౌంట్ ఫ్యూజీ శుభ్రత, నిర్వహణలో లోకల్ సొసైటీలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయి. మన దగ్గర కూడా ఇలాంటివి ప్రోత్సహించవచ్చు.
జపాన్‌లోని మరో పవర్ ఫుల్ సిటీ ఒసాకా
జపాన్‌లోని పవర్ ఫుల్ సిటీ ఒసాకా. దాని ఎకానమీ అవుట్ పుట్, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక జీవన శైలి ద్వారా ఇతర నగరాలకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఒసాకాలోనూ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్ ఉంది. ఒసాకా MSMEలను ప్రోత్సహించే కేంద్రంగా ఉంది. చిన్న మధ్యతరహా వ్యాపారాలకు ఇది పుట్టిల్లుగా ఉంది. ఈ MSME హబ్ ఎలా డెవలప్ అయిందో ఇక్కడ చూసి మన దగ్గర కూడా అన్వయించుకోవచ్చు. ఈ సిటీ స్టార్టప్‌లు, టెక్ హబ్‌లకు ఇంక్యుబేటర్ గా ఉంది. సో ఇతర నగరాలు ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఒసాకా నుంచి నేర్చుకోవచ్చు.
MSME హబ్ ఎలా డెవలప్ అయిందో నేర్చుకునే వీలు
అందుకే ఈ సిటిని కూడా సీఎం రేవంత్ సందర్శించబోతున్నారు. హైదరాబాద్ మాదిరిగానే ఒసాకా కూడా రద్దీ సిటీనే అయినా.. మెట్రో, బస్సులు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు సమర్థంగా, సమన్వయంతో నిర్వహించడం ద్వారా రద్దీ సమస్యను అధిగమిస్తోంది. మన దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన వేళ ఈ సిటీ నుంచి ప్రేరణగా ప్రజారవాణాపై స్టడీ చేయొచ్చు. అంతే కాదు.. పరిసరాల పరిశుభ్రత, రీసైక్లింగ్ పై జనం చాలా బాధ్యతగా ఉంటారు. మన దగ్గర అమలవుతున్న స్వచ్ఛ భారత్ ను మరింతగా జనంలోకి తీసుకెళ్లడం లేదంటే సరికొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచించే వీలు కలుగుతుంది.
ఇన్నోవేటివ్ అనుకూల వాతావరణానికి కీలకం
ఓవరాల్ గా జపాన్ డెవలప్ మోడల్ నుంచి తెలంగాణ నేర్చుకునేవి చాలానే ఉన్నాయి. అయితే సీఎం రేవంత్ పగ్గాలు చేపట్టాక పర్యావరణం కోసం హైదరాబాద్ వంటి చోట్ల చాలా చర్యలు తీసుకున్నారు. కాలుష్యరహితంగా ఉండేలా దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మెట్రో విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్రం అనుమతి ఇస్తే, జైకా వంటి సంస్థలు రుణ సౌకర్యం లభిస్తే ఈ ప్రాజెక్ట్ లో కదలిక వస్తుంది. అటు మూసీ పునరుజ్జీవం విషయంలోనూ కొందరు అడ్డుపడుతున్నారని, అయినా చేసి చూపిస్తామంటున్నారు సీఎం రేవంత్.
జపాన్ తో పోలిస్తే మన దగ్గర భూ లభ్యత ఎక్కువ
టోక్యోలో జనసాంద్రత ఎక్కువగా ఉన్నా.. భారీ భవనాలతో స్పేస్ వర్కవుట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేసి, ఇలా బహుళ అంతస్తుల భవనాలు, సమ్మిళిత వాణిజ్యనివాస సముదాయాలను నిర్మించవచ్చు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి టైర్ టూ నగరాల్లో అభివృద్ధిని విస్తరించడం ద్వారా హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించే ఆలోచన చేయవచ్చు. అయితే జపాన్ తో పోలిస్తే మన దగ్గర భూ లభ్యత చాలా ఎక్కువ. ఇది కలిసి వచ్చే అంశం.
స్కిల్ డెవలప్‌మెంట్ పై సీఎం పూర్తిస్థాయి ఫోకస్
ముఖ్యంగా సాంకేతిక ఆవిష్కరణ, పారిశ్రామిక వృద్ధి విషయంలో జపాన్ నగరాలైన ఒసాకా, టోక్యో.. స్టార్టప్‌లు, టెక్ హబ్‌లు, రోబోటిక్స్‌లో ముందున్నాయి. హైదరాబాద్ లోనూ ఇప్పటికే ఉన్న వాటిని మరింతగా ఎలా డెవలప్ చేయాలి.. హబ్ గా ఎలా మార్చాలి, ఎకోసిస్టమ్ కు కేరాఫ్ గా ఎలా మార్చాలో స్టడీ చేయొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ పై పూర్తిస్థాయి ఫోకస్ పెడుతున్నారు. స్కిల్ వర్శిటీ ఏర్పాటు, అడ్వాన్స్ డ్ ఐటీఐ సెంటర్లుగా మార్పు చేయడం ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జపాన్ పర్యటన ద్వారా మరిన్ని టేక్ అవేస్ తీసుకురాబోతున్నారు. విద్య నైపుణ్యాభివృద్ధిలో జపాన్ చాలా ముందుంది. ఈ విషయంలో జపాన్‌లో ఎడ్యుకేషన్, ట్రైనింగ్ సిస్టమ్ కొత్త ఇన్నోవేషన్ ను ప్రోత్సహిస్తాయి. మన దగ్గర కూడా సర్టిఫికెట్ల కోసం స్టడీ కాకుండా.. ప్రొడక్టివిటీ ఉండేలా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై ఫోకస్ పెంచేందుకు, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేందుకు రైజింగ్ టీమ్ జపాన్ పర్యటన ఉపయోగపడనుంది.