Bride Mother Fraud Wedding| సాధారణంగా పెళ్లి కార్యక్రమాల్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అతిథులకు సరిగా మర్యాదలు చేయలేదనో లేక వరుడి బంధువుల, పెళ్లికూతురు బంధువులు మధ్య ఘర్షణ జరగడమో చూస్తూ ఉంటాం. దాంతో గొడవలు జరిగి పెళ్లి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఒక పెళ్లి మొత్తం మోసపూరితంగా జరగుతుండగా.. అనుకోకుండా విషయం బయట పడింది. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పెళ్లి కూతురు స్థానంలో ఆమె తల్లి కూర్చొని వరుడితో పెళ్లికి సిద్ధమైంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మేరట్ జిల్లాకు చెందిన మొహమ్మద్ అజీం (22) అనే యువకుడికి మంతశా(21) అనే యువతితో వివాహం నిశ్చయమైంది. యువతి ఫొటో చూసి అజీం తనకు అందమైన పెళ్లికూతురు లభించిందని సంతోషించాడు. కానీ ఆ సంతోషం పెళ్లి దాకా వచ్చేసరికా ఆవిరైంది. ఎందుకంటే పెళ్లిలో మంతశా బదులు ఆమె తల్లి పెళ్లికూతురుగా వచ్చింది. ఈ విషయం అనూహ్యంగా బయటపడడంతో ఈ పెళ్లి మొత్తం మోసపూరితంగా జరుగుతోందని తెలిసింది.
ఎలా జరిగిందంటే?..
ముస్లింల వివాహ ప్రక్రియంలో పెళ్లికూతురు చీర కొంగును ముసుగులా ధరిస్తుంది. వరుడు, వధువు చాలా దూరంగా వేర్వేరుగా కూర్చుంటారు. వరుడు పురుషుల మధ్య వేరుగా మరో గదిలో ఉండగా.. వధువు మహిళలతో మరో గదిలో ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లి జరిపించే ఖాజీ (ముస్లిం పంతులు) వరుడి వద్ద కూర్చొని అతనికి ఫలానా వారి కూతురు అని చెప్పి పెళ్లికూతురు పేరుని ఉచ్ఛరిస్తూ.. ఆమెను భార్యగా నీవు స్వీకరిస్తావా? అని పెళ్లి కొడుకుని ప్రశ్నిస్తాడు. అప్పుడు అతను అంగీకారం తెలిపితే సగం పెళ్లి అయినట్లే. ఆ తరువాత పెళ్లికూతరు గదిలో వెళ్లగా.. అక్కడ మహిళలు ముసుగు ధరించి ఉంటారు. అప్పుడు ఖాజీ, ఇద్దరు సాక్ష్యులన తీసుకెళ్లి.. మీరు ఫలానా పేరు గల వ్యక్తి భర్తగా అంగీకారమా? అని అడుగుతాడు. ఆమె కూడా అవును.. అంగీకారమే అని చెబితే పెళ్లి పూర్తైనట్లే. దాన్నే ఇస్లాం మతంలో నికా అంటారు. ఇదంతా ఒకరకంగా క్రిస్టియన్లు పెళ్లి లాగే జరుగుతుంది. కానీ వేర్వేరు గదులు, ముసుగులు ఉండడం ప్రత్యేకం.
ఇప్పుడు అజీం పెళ్లిలో కూడా ఈ ముసుగు వల్లే మొత్తం మోసం జరిగింది. అజీం వద్దకు పెళ్లి జరిపించే ఖాజీ వచ్చి పెళ్లికూతరు మంతశా పేరుకు బదులు తాహిరా అని చదివాడు. దీంతో పెళ్లికూతురు పేరు మారిందేంటి? అని వరుడికి అనుమానం వచ్చింది. దాంతో అతను ఖాజీ గారు తప్పుగా చదివారేమోనని భావించి ఆయనను పొరపాటు జరిగిందేమో చెక్ చేయండని అడిగాడు. కానీ ఖాజీ గారు మాత్రం తాను సరిగానే చదివానని చెప్పారు. దీంతో ఏదో తప్పు జరిగిందని అజీంకు అనుమానం కలిగింది అందుకే పెళ్లి ఆపించేశాడు. తాను ఒకసారి పెళ్లికూతురు ముఖం చూడాలని అందరి ముందు అడిగాడు. అందుకు ఈ సంబంధం కుదిర్చిన అజీం అన్నా వదినలు, పెళ్లికూతురు తరపు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం
ట్విస్టు మీద ట్విస్టు
అయినా అజీం పట్టుబట్టాడు. ఏదో తప్పు జరుగుతోందని వాదించాడు. అప్పుడు ఖాజీ గారు అతడు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వెంటనే అనుమానాలు క్లియర్ చేయాలని చెప్పి.. అతడిని వెంటబెట్టుకొని పెళ్లికూతురు ఉన్న గదికి వెళ్లారు. అక్కడ వధువు ముసుగు తీసి ఆమె ముఖం చూడగా.. అజీం చూసిన ఫొటోలో ఉన్న యువతి ఆమె కాదని స్పష్టమైంది. పైగా ఆమెకు దాదాపు 50 ఏళ్ల వయసు ఉన్నట్లు కనిపిస్తోంది. అజీం ఈ విషయాన్ని పెళ్లిలో అందరికీ చెప్పాడు. అప్పుడే అతనికి మరో షాక్ తగిలింది. ఆ పెళ్లిలో తాను ఫొటోలో చూసిన అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. స్వయానా పెళ్లికూతురి కూతురు. ఇది తెలిసి అజీం ఇంత మోసమా? అని ప్రశ్నించాడు.
కానీ అప్పుడే పెళ్లిలో మరో ట్విస్టు వచ్చింది. అసలు ఇదంతా అజీం అన్నా, వదినలు చేసిన కుట్రగా బయటపడింది. అందుకే వారు అజీంని పక్కకు తీసుకెళ్లి.. మర్యాదగా ఈ పెళ్లి చేసుకోమన్నారు. లేదా అతనిపై రేప్ కేసు పెడతామని బెదరించారు. కానీ అజీం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి.. జరిగిన మోసం అంతా చెప్పాడు. తాను పెళ్లి కోసం రూ.5 లక్షలు ఖర్చుపెట్టానని.. అదంతా నష్టపరిహారంగా ఇప్పించాలని కోరాడు. పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నారు.