BigTV English

Karnataka: కాంగ్-రేస్.. బీజేపీకి బిగ్ ఛాలెంజ్!

Karnataka: కాంగ్-రేస్.. బీజేపీకి బిగ్ ఛాలెంజ్!
KARNATAKA election results

Karnataka Assembly Elections: రిజల్ట్స్‌పై ప్రధాన పార్టీల్లో టెన్షన్. ఈవీఎంలో ఏ నిర్ణయం దాగుందోననే ఉత్కంఠ. మెజార్టీ వచ్చినా.. అధికారం దక్కేనా అనే చింత. గత అనుభవాలు అలా ఉన్నాయి మరి. అప్పట్లో అతిపెద్ద పార్టీగా నిలిచామనే సంతోషం కాంగ్రెస్‌కు దక్కకుండా.. సీఎం సీటు కుమారస్వామి ఎగరేసుకుపోయారు. అంతలోనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆ సంకీర్ణ ప్రభుత్వమూ ఫసక్ అంది. ఈసారి కూడా దాదాపు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కర్నాటక ఎగ్జిట్ పోల్స్ మరింత కన్ఫ్యూజ్ చేశాయి.


సింపుల్‌గా చెప్పాలంటే.. బీజేపీకి వందలోపు. కాంగ్రెస్‌కు వందకుపైగా. జేడీఎస్, ఇతరులకు కొన్ని సీట్లు. ఇదీ సంగతి. మరి, పక్కాగా మేజిక్ ఫిగర్ 113 స్థానాల్లో ఫలానా పార్టీ గెలుస్తుందని ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేకపోయింది. ఇదే ఇప్పుడు కీలక పాయింట్.

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్సే నిలుస్తుందని క్లారిటీ వచ్చేసింది. అయితే..? బీజేపీ దూరంగా నిలిచిపోయిందా? లేదే. 10-20 సీట్ల తేడాతో కాంగ్రెస్ వెన్నంటే ఉంది బీజేపీ. ఇది చాలదా మళ్లీ కర్నాటకలో చక్రం తిప్పేందుకు? గతంలోనూ జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును పడగొట్టిన అనుభవం ఆ పార్టీ సొంతం.


లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు సపోర్ట్ చేయడంతో.. 120 సీట్ల మెజార్టీతో అధికారం చేపట్టింది. కానీ, కమలనాథుల అధికార దాహంతో.. కాంగ్రెస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వ మెజార్టీ పడిపోయింది. మంత్రులు రాజీనామా చేయడం.. స్పీకర్ అంగీకరించపోవడం.. సుప్రీంకోర్టు జోక్యం.. ఇలా ఆనాడు కర్నాటక అసెంబ్లీలో రచ్చ రచ్చ నడిచింది. చివరాఖరికి బీజేపీ అధికార పీఠం దక్కించుకుంది.

పదవిలోకి వచ్చినా.. ప్రజాదరణ పొందలేకపోయింది. అవినీతి ఆరోపణలతో యడ్యూరప్ప నుంచి సీఎం సీటు బస్వరాజ్ బొమ్మైని వరించింది. ఆయన పాలనా ఏమంత చక్కగా సాగలేదని టాక్. అదే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటర్లు పట్టం కట్టేలా చేసింది. భారీ మెజార్టీనే వచ్చేదేమో.. చివరి వారంలో ప్రధాని మోదీ.. జై బజరంగ్ భళీ నినాదం ఎత్తుకోకపోయుంటే. రెండు మెగా ర్యాలీలు సైతం బాగానే ఓట్లను కొల్లగొట్టి ఉండొచ్చు. అందుకే, మంచి ఆధిక్యంతో గెలవాల్సిన కాంగ్రెస్.. మళ్లీ హంగ్ జంక్షన్‌లో నిలిచేలా చేసింది.

కాంగ్రెస్‌కు సింగిల్‌గా 113 సీట్లు దాటి భారీ మెజార్టీ వస్తే ఓకే. కర్నాటకలో హస్తం పాలన సాధ్యమే. లేదంటే..? జేడీఎస్‌ను కలుపుకోవాలి. గత అసెంబ్లీలో చేదు అనుభవం ఉండనే ఉంది. ఒకవేళ హస్తానికి 113 సీట్లు దాటినా.. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోగలదా? మళ్లీ కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యులను బీజేపీ లాగేస్తుందా? ఈసారి కూడా అధికార పీఠం దక్కించుకుంటుందా? కమల వ్యూహాలను కాంగ్రెస్ తట్టుకుంటుందా? కర్నాటకం రంజుగా సాగనుందా? ఫలితాలతో సంబంధం లేకుండానే.. ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందా? ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×