BigTV English

KCR Reaction on Phone Tapping Case: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఫోన్ టాపింగ్ కేసుపై కేసీఆర్ రియాక్షన్

KCR Reaction on Phone Tapping Case: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఫోన్ టాపింగ్ కేసుపై కేసీఆర్ రియాక్షన్

కేసీఆర్‌ చెప్పిన డైలాగ్‌లో హైలేట్ పార్ట్ ఏంటంటే.. ఇది ఫస్ట్ ఆశ్చర్యంగా.. ఆ తర్వాత షాకింగ్‌గా.. అంతకుమించి ఫన్నీగా అనిపించింది. రాధాకిషన్‌ రావు ఎవరో సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు తెలియదంటా..? ఇదేలా సాధ్యం..? అస్సలు అంతుపట్టని క్వశ్చన్ ఇది. ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌నే రివర్స్‌లో ప్రశ్నించారు కేసీఆర్.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇరుక్కున్న రాధాకిషన్‌ రావు ఎవరో నిజంగా కేసీఆర్ తెలియదా..? మరి తెలియకుండానే రిటైర్ అయిన రాధాకిషన్‌ రావును ఆఫీసర్ ఆన్ స్పెషల్‌ డ్యూటీగా నియమించారా..?

తెలియకపోతే టాస్క్‌ఫోర్స్‌లో కీలక బాధ్యతలను ఎందుకు అప్పగించారు? ఇదంతా సీఎం హోదాలో ఉన్న మీకు తెలియకుండానే జరిగిందా? మరి ఈ ప్రశ్నలకు కేసీఆరే సమాధానం చెప్పాలి. కానీ ఆయన మాత్రం వీటిపై నోరు మెదపరు. పోనీ ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా రివర్స్‌లో దాడి మొదలు పెడతారు. ఒక్కసారి రాధాకిషన్‌ రావు కన్‌ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ను చూద్దాం.. అందులో ఆయన క్లియర్‌కట్‌గా చెప్పారు. క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ అనుగుణంగానే తన సెలక్షన్ జరిగింది. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత SIB చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌ రావు కూడా తనను సెలెక్ట్ చేసేందుకు అంగీకరించారు. బీఆర్ఎస్ సుప్రీమోకు తెలిసే ఇదంతా జరిగింది. ఇదీ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చెప్పిన అంశాలు. మరి ఎవరి మాటలు నమ్మాలి? కేసీఆర్ మాటలు నమ్మాలా? రాధాకిషన్‌రావు మాటలు నమ్మాలా?


Also Read: ‘మోదీ, అమిత్ షా సంక్రాంతి గంగిరెద్దుల్లా రాష్ట్రానికి వస్తున్నారు’

సమాధానం చెప్పలేదు.. సరే.. కానీ ఆ తర్వాత కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై మాట్లాడారు. అది మరో హైలేట్.. ఇది దబాయింపుతో కూడిన అంగీకారంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్.. అంటే అప్పుడు మీరు చేశారని చెప్పకనే చెబుతున్నట్టు ఉంది ఆయన స్టేట్‌మెంట్‌.. అంతేకాదు దీన్ని నమ్మేలా మరో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు కేసీఆర్. హోంసెక్రటరీ పర్మిషన్‌ తీసుకొని పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. చేసిన తర్వాత దానిని డిమాలిష్‌ చేసే హక్కు కూడా పోలీసులకు ఉంది.

ఇది టెలిగ్రాఫ్‌ యాక్ట్‌లోనే ఉంది. ఇవన్నీ కేసీఆర్ స్టేట్‌మెంట్సే.. కేసీఆర్‌ మాట్లాడిన మాటలన్ని ఒక ఆర్డర్‌లో చూద్ధాం.. ఫస్ట్‌ రాధాకిషన్‌రావు ఎవరు? అన్నారు. తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌కు నాకు ఏంటి సంబంధ అన్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ ట్యాపింగ్‌ చేసే రైట్‌ ఉంది అంటున్నారు. అంటే ఫోన్‌ ట్యాపింగ్ చేశారేమో అంటూనే.. చేసే హక్కు ఉంది అంటున్నారు కేసీఆర్.. కేసీఆర్‌ నిజంగా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? లేక ప్రజలను కావాలని కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు.

Also Read: Arvind Kejriwal: జరగబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎంత?

మాములుగా క్లారిటీ ఇవ్వనప్పుడు రాజకీయ నేతలు చేసే పని మరింత కన్‌ఫ్యూజ్‌ చేయడం.. కేసీఆర్ ఈ థియరీని ఫాలో అవ్వడమే కాదు.. ఇంప్లిమెంట్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల టైమ్‌ కాబట్టి.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఎక్కువగా చర్చకు రావడం లేదు. వన్స్‌ ఎలక్షన్స్‌ ముగిసిన తర్వాత ఈ పంచాయితీ మరింత పీక్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కేసీఆర్‌ ఇప్పుడు మాట్లాడిన మాటలనైనా గుర్తు పెట్టుకుంటారా? మళ్లీ తర్వాత నేనేప్పుడు అన్నాను అంటారా? అనేది చూడాలి.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×