IPL 2024 60th Match – Kolkata Knight Riders Vs Mumbai Indians Highlights: ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ కి అధికారికంగా చేరిన తొలిజట్టుగా కోల్ కతా నిలిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి 18 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న జట్ల పాయింట్లను బట్టి, కోల్ కతా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయినట్టే చెప్పాలి.
ఇక ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ 2024 సీజన్ మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం కనిపించడం లేదు. ఎందుకంటే గెలిచి పరువు నిలబెట్టుకోవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయి, మరింత దిగజారిపోయింది.
కోల్ కతాతో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్.. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ ని 16 ఓవర్లకి కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఒకవేళ గెలిస్తే మేం కూడా బౌలింగు తీసుకునేవాళ్లమని కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు.
Also Read: IPL 2024 GT vs KKR Match Preview: గుజరాత్ రేస్ లోకి వస్తుందా?.. నేడు కోల్ కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో ముంబై 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
వివరాల్లోకి వెళితే…158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కి ఈసారి ఓపెనర్స్ 6.5 ఓవర్ల వరకు వికెట్లు పడకుండా చూసుకున్నారు. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద తొలివికెట్ గా ఇషాన్ కిషన్ (40) అయిపోయాడు. తను 22 బంతుల్లో 2 సిక్స్ లు, 5 ఫోర్లు కొట్టాడు. అనంతరం మరో రెండు పరుగులు జోడించిన తర్వాత జట్టు స్కోరు 65 వద్ద టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (19) అయిపోయాడు. అయితే ఇవి ఆడేందుకు తను 24 బంతులు తీసుకున్నాడు.
Also Read: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు..
ఇక ఎప్పటిలా నిలబెడతారనుకున్న సూర్యకుమార్ (11), తిలక్ వర్మ (32) కాడి వదిలేశారు. తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) వెంటనే అయిపోయాడు. మిగిలిన వాళ్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. అందరూ ఒకటి, రెండు ఇలాగే చేశారు. కాకపోతే నమన్ ధిర్ 6 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
అంతే 16 ఓవర్లు అయిపోయాయి. దీంతో ముంబై 8 వికెట్ల నష్టానికి 139 పరుగుల వద్ద ఆగిపోయింది. అలా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
కోల్ కతా బౌలింగులో హర్షిత్ రాణా 2, వరుణ్ 2, ఆండ్రీ రసెల్ 2, సునీల్ నరైన్ 1 వికెట్ పడగొట్టారు.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతాకి అయితే అస్సలు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (6) అవుట్ అయ్యాడు. ఆ వెంటనే సునీల్ నరైన్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఆదుకుంటాడనుకన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో 4.1 ఓవర్ లో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులతో కోల్ కతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
Also Read: RCB vs DC Match Highlights: తాను ఓడి.. ఆర్సీబీకి ఊపిరిపోసిన ఢిల్లీ
ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్ 21 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. తనకి నితిష్ రాణా (33) సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్ (24), రింకూ సింగ్ (20) చివర్లో ధనాధన్ ఆడారు. ఆ తర్వాత రమణ్ దీప్ సింగ్ ..17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి, పర్వాలేదనిపించింది.
ముంబై బౌలింగులో బుమ్రా 2, నువాన్ తుషార 1, అంశుల్ కంబోజ్ 1, పియూష్ చావ్లా 2 వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో కోల్ కతా డైరక్టుగా ప్లే ఆఫ్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ముంబై ఎప్పటిలా తనకి అచ్చొచ్చిన 9వ నెంబర్ లో ఉండిపోయింది.