Lok Sabha Elections 2024 Phase 4: నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. అయితే, రేపు ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. నాలుగో దశలో భాగంగా మొత్తం 96 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 10 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 1,717 మంది పోటీ చేస్తున్నారు. అయితే, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. అత్యలంగా ఒడిశాలోని నవరంగ్ పుర్ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఈ దఫాలో పలువురు ముఖ్యనేతలు బరిలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈయన యూపీలోని కన్నోజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఉజియార్ పూర్ నుంచి మరో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ బరిలో ఉన్నారు. బెంగాల్ లోని బహరాంపుర్ నుంచి ప్రముఖ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ స్థానం నుంచి బీజేపీ నాయకురాలు పంకజా ముండే పోటీ చేస్తున్నారు. వీరితోపాటు పలువురు కూడా పోటీ చేస్తున్నారు.
Also Read: Lok Sabha Elections 2024: నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధం.. 96 ఎంపీ స్థానాల బరిలో 1,717 మంది
తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్నది. అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనున్నది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఇక్కడ ఈసారి పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు.