BigTV English

Telangana CM: ఢిల్లీకి భట్టి విక్రమార్క, ఉత్తమ్.. సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ

Telangana CM: ఢిల్లీకి భట్టి విక్రమార్క, ఉత్తమ్.. సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ
Telangana new CM updates

Telangana new CM updates(Telangana congress news today):


తెలంగాణ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో విజయం సాధించి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకూ తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడలేదు. నిజానికే నిన్నే సీఎం అభ్యర్థి ప్రకటన, రాత్రికి రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిసింది. కానీ.. సీఎం అభ్యర్థిక ఎంపిక తుది నిర్ణయం హైకమాండ్ కే అప్పగించడంతో ఆలస్యమైంది.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు అధిష్టానం నుంచి పిలుపురావడంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి పెద్దలతో మంతనాలు జరిపారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కకు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో వారిద్దరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఖర్గేతో సమావేశమై.. సీఎం రేసులో తాము కూడా ఉన్నామని చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత రేవంత్ రెడ్డినే సీఎం అని అంతా భావించారు కానీ.. సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో.. తెలంగాణ కొత్త సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోగా సీఎం అభ్యర్థి విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు హోటల్ ఎల్లా వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మినహా.. ఇతరులెవరినీ హోటల్ లోపలికి అనుమతించడం లేదు.


.

.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×