KCR With Jagan: దేశంలో రాజకీయాలు హీటెక్కాయా? ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ భావిస్తోందా? అందుకోసం తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. ఇండియా కూటమి అభ్యర్థిని దించుతుందా? లేకుంటే డ్రాపవుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఒకవేళ ఇండియా కూటమి బరిలో ఉంటే కేసీఆర్ ఎటువైపు మొగ్గు చూపుతారా? అన్నది అసలు ప్రశ్న.
ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న మిత్రులతో మంతనాలు సాగిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం జగన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీకి పెద్దల సభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఈ విషయంలో జగన్ నో అని చెప్పడం కష్టం.
ఎందుకంటే ఆయన మెడపై కేసుల కత్తి వేలాడడంతో కచ్చితంగా ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇంతవరకు ఓకే.. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దించితే కేసీఆర్ ఎటువైపు మొగ్గు చూపుతారు? ఎన్డీయే వైపు చూస్తారా? లేక ఇండియా కూటమి వైపు వెళ్తారా?
ఇంతకీ జాతీయ పార్టీల నుంచి కేసీఆర్‌కు ఎవరైనా ఫోన్ చేశారా? లేదా జగన్ వైపు నుంచి మంతనాలు సాగిస్తున్నారా? ఇదే ప్రశ్నలు తెలంగాణలో ఆ పార్టీ నేతలు వెంటాడుతోంది. బీఆర్ఎస్‌కు లోక్‌సభ నుంచి ఒక్క ఎంపీ కూడా లేరు. పెద్దల సభలో ఆ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయేకు కేసీఆర్ మద్దతు ఇస్తారా? ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతారా?
ALSO READ: బీఆర్ఎస్‌కు దిక్కెవరు? పత్తాలేని నాయకులు
జాతీయ పార్టీల నుంచి కేసీఆర్‌కు ఫోన్ వచ్చిన సందర్భం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ద్వారా కేసీఆర్‌ను తమవైపు తిప్పుకునేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోందా? అవుననే అంటున్నారు కొందరు నేతలు. ఎందుకంటే జగన్-కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి జాతీయ స్థాయి నాయకులకు బాగా తెలుసు.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకరితో మాట్లాడితే.. మరో వ్యక్తి మొగ్గు చూపవచ్చని అంటున్నారు. ఈ లెక్కన ఎన్డీయే వైపు కేసీఆర్ వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఆ పార్టీకి డ్యామేజ్ కావడం ఖాయమని అంటున్నారు కారు పార్టీ నేతలు. అందుకే జగన్ ద్వారా బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు హస్తినలో వార్తలు జోరందుకున్నాయి.
ఢిల్లీలో మంగళవారం ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశానికి కూటమిలోని పార్టీల సభ్యులు హాజరవుతున్నారు. ఒకవేళ అభ్యర్థిని గనుక నిలబెడితే తమిళనాడుకు చెందిన వ్యక్తి ఉంటారని అంటున్నారు.
ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియా కూటమి అటువైపు మొగ్గు చూపే అవకాశముందని అంటున్నారు. మధ్యాహ్నం లోపు అభ్యర్థి నిలుపుతుందా? లేదా స్పష్టత రానుంది. దాని తర్వాత కేసీఆర్ ఎటువైపు అన్నది తేలుతుందని అంటున్నారు.