BigTV English

Ghmc : టపాసులు అమ్ముతున్నారా, అయితే మీ దుకాణాలకు ఇవి తప్పనిసరి, లేకుంటే అంతే సంగతులు : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

Ghmc : టపాసులు అమ్ముతున్నారా, అయితే మీ దుకాణాలకు ఇవి తప్పనిసరి, లేకుంటే అంతే సంగతులు : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

 


Greater Hyderabad Muncipal Commissioner Ilambarthi : గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో దీపావళి పండక్కి టపాసులు విక్రయిస్తున్నారా, అయితే ఇది మీ కోసమే మరి. ఈ మేరకు దుకాణాదారులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు.

లైసెన్స్ ఫీజులు ఎంతంటే…


పండుగ సందర్భంగా పటాకలు విక్రయించే దుకాణాదారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు, హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలు లైసెన్స్ ఫీజు ఉంటుందన్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ గల్లీలకు దూరంగానే …

ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య టపాసుల దుకాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదన్నారు. ఇక స్టాల్స్‌ ఏర్పాటు చేసే ముందు విద్యుత్‌కు సంబంధించి నాణ్యమైన పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ఇక గల్లీలు, బస్తీలు, కాలనీలు, ప్రజలకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు.

దుకాణాదారులదే బాధ్యత…

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే, దుకాణాల యజమానులనే బాధ్యతులుగా చేస్తామన్నారు. మైదానాలు, పెద్ద హాల్స్‌లో ఫైర్ సేప్టీ ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి స్టాల్ చుట్టుపక్కన పరిసరాలను అత్యంత జాగ్రత్తగా, పరిశుభ్రంగా నిర్వహించుకోవాలన్నారు.

పర్మిషన్ తీసుకోవాల్సిందే…

స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్లు ముందస్తు అనుమతి పొందాలన్నారు.  ఈ మేరకు నిర్ణీత ఫీజును చెల్లించి బల్దియా నుంచి సర్టిఫికేట్ కాపీ తీసుకోవాలన్నారు. ఇక తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఈ క్రమంలోనే www.ghmc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.

పీసీబీ ఆదేశాలు పాటించాల్సిందే…

మరోవైపు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి – పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్)  ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇక న్యాయస్థానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పకుండా పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

లైసెన్స్ రద్దు చేస్తాం…

పలురకాల బాణాసంచ విక్రయాలపై నిషేధం ఉందన్న కమిషనర్ ఇలంబర్తి, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఎవరైనా రూల్స్ పాటించకపోతే దుకాణాదారుల తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ను రద్దు చేస్తామన్నారు.

also read :  సింగరేణి కార్మికులకు శుభవార్త, దీపావళి బోనస్’గా రూ.358 కోట్లు రిలీజ్, రేపే అకౌంట్లలో వేస్తాం : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×