E-Paper
Advertisement

Women reservation : రంగంలోకి బడా నేతల ఫ్యామిలీ లేడీస్!

Women reservation : రంగంలోకి బడా నేతల ఫ్యామిలీ లేడీస్!
Advertisement

మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే రేపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎన్డీయే కూటమిలోని పార్టీలతో పాటు ఇండియా కూటమి పార్టీలు సైతం మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల సానుకూలంగానే ఉన్నాయి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ మేరకు బీజేపీ ఎంపీలకు ఇప్పటికే అత్యంత కీలకమైన మూడో లైన్ విప్ జారీ అయ్యింది. ఇప్పటికే ఎంపీలు అందరూ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలోనే నేడు ఇండియా కూటమి పార్టీలు అత్యంత అవసరంగా సమావేశమయ్యాయి.

33 శాతం రిజర్వేషన్..

మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందితే వచ్చే జమిలి ఎన్నికల్లో చట్టసభల్లో వారికి 33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు, 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. డీమిలిటేషన్‌లో భాగంగా రాష్ట్రంలో 180 అసెంబ్లీ సీట్లు, 28 పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి. వీటిలో 60 ఎమ్మెల్యే సీట్లు, 8 వరకు ఎంపీ సీట్లు మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. దీనికి తోడు ఎస్టీ, ఎస్టీ, జనరల్ కోటా, మహిళా రిజర్వేషన్ల సైతం ఇందులో లెక్కించనున్నారు. ఈ ప్రకారం రాష్ట్రం, దేశంలో సీట్లు భారీగా పెరిగితే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళల భాగస్వామ్యం పెరగనుంది.మహిళా రిజర్వేషన్ల అంశం తెరమీదకు రావడంతో బడా రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

పురుషులకు నో చాన్స్..

Advertisement

ఇంతకాలం మహిళా రిజర్వేషన్లు లేకపోవడంతో పురుషులు ఇష్టానుసారంగా రాజకీయాలు చేశారు. పార్టీల పరంగా లాబీయింగ్ లు చేసి మరీ సీట్లు పొందారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టమైతే వచ్చే ఎన్నికల్లో వారి సీట్లు వారికే ఉంటాయి. అందులో పురుషులు పోటీ చేయడానికి వీలుండదు. చాలా మంది నియోజకవర్గాలు సైతం మారనున్నాయి. ఇప్పుడున్న నియోజకవర్గాల పరిధి సరిహద్దులు మారనున్నాయి. పరిధి వైశాల్యం కూడా తగ్గనుంది. దీంతో సీనియర్ నేతలు అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో తెలియక సీనియర్లతో కలిసి మంతనాలు చేస్తున్నారు.

OG 2: పవన్ కళ్యాణ్ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. అంతమంది హీరోలా?

Advertisement

ఇదిలాఉండగా, కొందరు నేతలు ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. మహిళా రిజర్వేషన్ అమలయ్యాక తమ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు అయితే ఆ స్థానాల్లో తమ కుటుంబీలకు రంగంలోకి దించాలని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కీలక నేతలు తమ భార్యలు, కోడళ్లను రాజకీయరంగ ప్రవేశం కోసం మార్గం సుగమం చేసుకోవడంతో పాటు పార్టీల అధిష్టానాలకు ముందే హింట్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల కీలక నేతలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. కేడర్‌కు సైతం సంకేతాలు పంపినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు తమ కుటుంబంలోని మహిళలను ప్రజలకు పరిచయం చేయడంలో బిజీగా మారారు. ఆ జాబితాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తదితరులు ఉన్నట్టు తెలుస్తున్నది. అన్ని పార్టీలు, రాష్ట్రాల్లోనూ ఇాదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తున్నది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×