BigTV English
Advertisement

Allu Arjun : బన్నీకి జోడిగా క్వీన్ ఆఫ్ బాలీవుడ్.. ఫ్యాన్స్ లో జోష్..

Allu Arjun : బన్నీకి జోడిగా క్వీన్ ఆఫ్ బాలీవుడ్.. ఫ్యాన్స్ లో జోష్..

Allu Arjun: ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు వారి నట వారసుడిగా గంగోత్రి మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకొని క్రమంగా ఎదిగిన సూపర్ హీరో బన్నీ. త్వరలో అతను పుష్ప 2 అంటూ మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పుష్ప మూవీ అల్లు అర్జున్ కెరీర్ ను పీక్స్ కు తీసుకు వెళ్లిన చిత్రం. కేవలం టాలీవుడే కాకుండా వరల్డ్ వైడ్ పుష్ప రాజ్ కు ఫాన్స్ అయిపోయారు. ఆ మూవీలో సాంగ్స్ కి స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు.


ఇక ఈ విషయం పక్కన పెడితే పుష్ప సీక్వెల్ తర్వాత బన్నీ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. జులాయి ,సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం మూవీలు బన్నీ కెరీర్ ని ఒక మలుపు తిప్పాయి. అతనిలోని విలక్షణ నటుడిని పరిచయం చేయడమే కాకుండా కామెడీ టైమింగ్ లో అల్లు అర్జున్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో చూపించాయి. పైగా ఈ చిత్రాల్లో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ కు అల్లు అర్జున్ యాక్షన్ ప్రేక్షకులను ఫిదా చేశాయి.

దీంతో నెక్స్ట్ వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో క్వీన్ ఆఫ్ బాలీవుడ్ అల్లు అర్జున్ సరసన నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో కాదు బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ దీపికా పదుకొణె. ఇప్పటికే దీపిక ప్రభాస్ కల్కి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక బన్నీతో కూడా యాక్ట్ చేస్తే టాలీవుడ్ లో దీపిక క్రేజ్ మరింత పెరుగుతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో దీపిక బన్నీతో కలిసి నటించాలని ఉంది అని కూడా చెప్పింది.


తాజాగా వీరిద్దరి కాంబో గురించి చర్చలు రావడంతో ఈ పాత న్యూస్ ని కూడా బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా పూజ హెగ్డేను తీసుకునే అవకాశం ఉందట. అలవైకుంఠపురం మూవీ తర్వాత తిరిగి ఈ క్యూట్ కాంబో ని ప్రేక్షకులకు చూసే అవకాశం కలుగుతుంది. బన్నీ మాస్ స్టెప్స్ కి దీపిక ఎనర్జీ తోడైతే ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సాంగ్స్ కి థియేటర్ దద్దరిల్లాల్సిందే. అయితే ఇంకా హీరోయిన్ ఎవరు అన్న విషయంపై చిత్ర బృందం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×