BigTV English

Edition Bikes:బీఎండబ్ల్యు బైక్స్.. వందేళ్ల లిమిటెడ్ ఎడిషన్ విడుదల..

Edition Bikes:బీఎండబ్ల్యు బైక్స్.. వందేళ్ల లిమిటెడ్ ఎడిషన్ విడుదల..

Edition Bikes:చూడాగానే వావ్ అనిపించేలా ఉన్న ఈ బైక్స్ సాధారణమైనవి కాదు. బీఎండబ్ల్యూ బైక్స్. అది కూడా వందేళ్ల లిమిటెడ్ ఎడిషన్ బైక్స్. R 9T 100 ఇయర్స్, R18 100 ఇయర్స్ పేరుతో… రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది… బీఎండబ్ల్యూ. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన R 9T 100 ఇయర్స్ బైక్ ధర రూ.24 లక్షలు కాగా… R18 100 ఇయర్స్ ధర రూ.25.9 లక్షలు. ఇంత భారీ ధర పెట్టినా ఆ బైక్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే… ఒక్కో మోడల్‌లో కేవలం 1923 బైకులను మాత్రమే ఉత్పత్తి చేయనుంది… బీఎండబ్ల్యూ. ఎందుకు 1923 బైక్‌ల్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోందంటే… సరిగ్గా వందేళ్ల కిందట 1923లో తొలిసారి ఆ బైక్‌లను విడుదల చేసింది కాబట్టి.


ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు మోటొరాడ్… తొలిసారి 1923లో ఈ బైక్‌లను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఆ బైక్‌లను రూపొందించి వందేళ్లు పూర్తైన సందర్భంగా… రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. R 9T 100 ఇయర్స్ బైక్ చూడటానికి రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ మాదిరి ఉంటుంది. ఇందులో 1170 సీసీ ఫ్లాట్-ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ అమర్చారు. ఇది 107.2 బీహెచ్‌పీ పవర్, 100.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక R18 100 ఇయర్స్ బైక్… చూడటానికి క్రూయిజర్ మోటార్‌సైకిల్ మాదిరి ఉంటుంది. ఇందులో 1,802 సీసీ ఫ్లాట్-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది 89.8 బిహెచ్‌పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు బైక్‌ల ఇంజిన్లు… 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపొందించారు.

వందేళ్ల లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, పేరుకు తగ్గట్టే బ్యాడ్జ్, క్రోమ్ మిక్స్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, మిల్లింగ్ సిలిండర్ హెడ్ కవర్లు, ఇంజన్ హౌసింగ్ కవర్లు, సీట్ హోల్డర్లు, ఆయిల్ ఫిల్లర్ ప్లగ్, అడ్జస్టబుల్ హ్యాండ్ లివర్లు, ఫుట్‌పెగ్‌లు వంటివి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక బైక్ సీటు.. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్‌ ఆక్స్‌బ్లడ్ ఫినిషింగ్‌తో ఆకట్టుకునేలా ఉంది. R 9Tతో పోల్చితే… R18లో తక్కువ కాస్మొటిక్ అప్‌డేట్స్ ఉన్నాయి. ఇందులో టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ వైట్ కలర్‌ డబుల్ పెయింట్ లైన్స్ ఇచ్చారు. డ్యూయెల్ కలర్ సీట్ మీద 100 ఇయర్స్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇవే కాదు… అక్రాపోవిక్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ హెడ్‌లైట్, హీటెడ్ గ్రిప్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఈ బైక్‌ల్లో అదనపు ఆకర్షణలు.


Gold rates : నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Lamborghini Cars:లగెత్తిన లంబోర్గిని సేల్స్

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×