E-Paper
Advertisement

Gold rates: వావ్! గోల్డ్ రేటు బాగా తగ్గనుందా?

Gold rates: వావ్! గోల్డ్ రేటు బాగా తగ్గనుందా?
Advertisement
gold-rates-in-the-market-today

Gold rates: తులం బంగారం ఓ 20 వేలకు దొరికే ఎంత బాగుంటుంది! ఇంతలా కాదు కానీ.. కాస్త తక్కువకే వచ్చే ఛాన్సుంది. ఎందుకంటే.. గోల్డ్ రేటు ఎక్కువగా ఉండడంతో చాలామంది కొత్త ఆభరణాలు కొనడం లేదు. పాత పుత్తడి వస్తువులను మార్చుకుని.. కొత్త వాటిని తీసుకుంటున్నారు. ప్రపంచ స్వర్ణమండలి.. అంటే WGC రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది. చాలామంది రేటు ఇంకాస్త తగ్గుతుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటకే గోల్ట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే శుభకార్యాలకు కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మన దేశంలో చాలామందికి అలవాటు. మనదేశంతోపాటు చైనాలో మాత్రం బంగారాన్ని డైరెక్ట్ గానే ఎక్కువగా కొంటారు. ఫారిన్ లో మాత్రం ఇలా ఉండదు. అక్కడ బంగారాన్ని డైరెక్ట్ గా కొనరు. దానిపై పెద్దగా ఆసక్తి చూపించరు. దానికి బదులుగా బంగారం, వెండిపై పెట్టుబడి పెడతారు. ఈ రెండింటి ఫ్యూచర్ కాంట్రాక్ట్ లు కొనుగోలు చేస్తారు. లాభాలకు అమ్మేస్తారు. ఇక్కడ మనం షేర్ మార్కెట్ లో ఎలా బిజినెస్ చేస్తామో అక్కడలా చేస్తారు.

Advertisement

ఇక పుత్తడి రేటు విషయానికి వస్తే.. భవిష్యత్తులో బాగా తగ్గే ఛాన్స్ ఉందట. ఎందుకంటే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర మరో 40, 50 డాలర్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే మన దేశంలో 10 గ్రాముల మేలిమి బంగారం 55 వేల రూపాయిలకు, కిలో వెండి సుమారు 60 వేల రూపాయిలకు లభించే ఛాన్స్ ఉందట. ముంబై బులియన్ మార్కెట్ లో కూడా ఇదే టాక్ నడుస్తోంది. కాబట్టి.. ధరలను నిత్యం గమనిస్తూ రేటు తగ్గినప్పుడు కొనుక్కుంటే మంచిది.

Tags

Related News

అందరు బాగుండాలి.. అందులో నేనుండాలి! ‘బంగారం’ పరమార్థం ఇదే! తెలంగాణ ప్రజల ‘బంగారు’ సందేశం..! ఆనవాయితీకి ఆధారమైన ఆ పురాణగాథలేమిటీ?

పాలపిట్ట దర్శనం.. విజయానికి సంకేతం! పాలపిట్టతో తెలంగాణకు విడదీయలేని అనుబంధం..! పురాణాలేం చెబుతున్నాయి?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

Big Stories

Advertisement
×