BigTV English
Advertisement

Sreeleela : వరుస సినిమాలు.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్..

Sreeleela : వరుస సినిమాలు..  శ్రీలీల షాకింగ్ కామెంట్స్..

Sreeleela : ప్రజెంట్ యూత్ క్రష్ ,గ్లామరస్ బ్యూటీ శ్రీలీల మొదటి సినిమా తోటి ఏం మాయ చేసిందో తెలియదు కానీ వరుస పెట్టి చిత్రాల తో బిజీ అయిపోతుంది. టాప్ హీరోయిన్లను కూడా సైడ్ లైన్ చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ చాలా ఒత్తిడి తట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే పండుగ సీజన్లో ఏ పోస్టర్లో చూసిన శ్రీలీల ఉంటుంది అని కామెడీ చేసే వారే కానీ పాపం నెలకొక సినిమా చేయడానికి శ్రీలీల ఎంత కష్టపడుతుందో ఎవరు అర్థం చేసుకోవడం లేదు.


తన గ్లామర్ తో, నటనతో కుర్ర కారు మతి పోగోడుతున్న శ్రీలీల కు దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇవ్వడానికి క్యూ కడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతూ శ్రీలీల కూడా వచ్చిన మంచి ఆఫర్స్ అన్ని ఒప్పుకుంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్య సుమారు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రీలీల రాబోయే సీజన్ లో దీన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తుంది. పైగా బిజీ షెడ్యూల్ కారణంగా హీరోల కంటే కూడా శ్రీలీల కాల్ షీట్స్ దొరకడం  చాలా కష్టంగా మారుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ దగ్గర లేనన్ని ఆఫర్లు శ్రీలీల దగ్గర ఉన్నాయి. అగ్ర హీరోలే కాకుండా సెకండ్ టైర్ హీరోలతో కూడా చేయడానికి శ్రీలీల వెనకాడడం లేదు. ఈ ఏడాది అస్సలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ ఎవరు అంటే శ్రీలీల అని వెంటనే చెప్పొచ్చు. మొన్న రామ్ పోతినేని తో శ్రీ లీల నటించిన స్కంద చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.


ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి భగవంథ్ కేసరి సినిమా తో రాబోతోంది. స్కంద మూవీ వల్ల జరిగిన ఇమేజ్ డామేజ్ భగవంథ్ కేసరి తో సరి చేసి మళ్ళీ ట్రాక్ లోకి రావాలి అనేది ఆమె ఆశ. ఇక బాలయ్య మూవీ తో పాటు ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడు ఖాతా లో ఉన్నాయి.ఇంత వరకు బాగానే ఉంది..కానీ పాపం ఇలా నెలకు ఒక సినిమా తో స్క్రీన్ పై కనిపించడానికి శ్రీలీల బాగానే కష్టపడుతోంది.

అసలు గ్యాప్ లేకుండా ఇలా వరుస మూవీస్ చేయడం అంటే అంత ఈజీ కాదు మరి.భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె  ప్రస్తుతం బిజీ షెడ్యుల్ కారణంగా తాను పడుతున్న ప్రెషర్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీరు నటించిన సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి కదా, ఇలాంటి రేర్ రికార్డ్ ను మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల తన కష్టాలు చెప్పుకొచ్చింది.

“చూసేవాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నట్లే ఉంటుంది కానీ నిజానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో మాకే తెలుస్తుంది. ఒకపక్క షూటింగ్ పనులు మరోపక్క డబ్బింగ్ వర్క్ ఇది చాలు అన్నట్టు సాంగ్స్ కూడా షూట్ చేయాలి. ప్రస్తుతం నా పరిస్థితి మామూలుగా అయితే లేదు ఇంత ఒత్తిడి ఒక్కొక్కసారి తట్టుకోలేనేమో అనిపిస్తుంది. కానీ మొన్న ఏదో ఒక సందర్భంలో బాలయ్య గారు వాళ్ళ నాన్న ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకొచ్చారు. ఒక్క టైం కి ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలు చేసేవారు ,ఎలా చేసేవారు అనేది తెలుసుకొని నేను చాలా థ్రిల్ అయ్యాను. అలాంటి వాళ్లతో పోల్చుకుంటే మనం నథింగ్ అనిపించింది.” అని అంది శ్రీలీల.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×