BigTV English

Starbucks : భిన్న రుచుల సంగమం స్టార్‌బక్స్..!

Starbucks : భిన్న రుచుల సంగమం స్టార్‌బక్స్..!

Starbucks : అమెరికాలో అత్యంత వేగంగా సర్వీసులు అందించే రెండో బ్రాండ్‌గా స్టార్‌బక్స్‌కు పేరుంది. 1971లో సియాటెల్‌లో ఆరంభమైన ఈ సంస్థ క్రమంగా 80 దేశాలకు విస్తరించింది. తమ స్టోర్లకు వచ్చే కస్టమర్లకు క్షణాల్లో కాఫీ లేదంటే వారు కోరుకున్న బెవరేజెస్‌ను అందిస్తూ వస్తుంది.


స్టార్‌బక్స్ ఆదాయంలో 74% బెవరేజెస్ ద్వారానే లభిస్తోంది. 22 శాతం ఫుడ్, ఇతర మార్గాల ద్వారా మరో 4 శాతం ఆదాయం వస్తోంది. మెక్‌డొనాల్డ్స్‌లా కాకుండా వ్యాపార విస్తరణ విషయంలో స్టార్‌బక్స్ రూటే సెపరేటు. బ్రాండ్, ఉత్పత్తులు, ఆపరేషనల్ మెథడ్స్ కోసం థర్డ్ పార్టీ ఆపరేటర్లకు లైసెన్స్‌లు అందజేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్లలో సొంతంగా నిర్వహించేవి సగమైతే.. మరో 50 శాతం లైసెన్స్ పొందినవి ఉంటాయి.
అంటే ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను పక్కాగా అమలు చేస్తోందన్న మాట. ఇండియాలో 300 వరకు స్టార్‌బక్స్ స్టోర్లు ఉన్నాయి.
వాస్తవానికి స్టార్‌బక్స్‌కు పెద్దమార్కెట్ అమెరికా, చైనా దేశాలే. మొత్తం స్టోర్లలో 61% ఈ రెండు దేశాల్లోనే ఉన్నాయి.


అమెరికాలో 16,346, చైనాలో 6,804 స్టార్‌బక్స్ స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్లు ఉన్న మూడో పెద్ద దేశం కొరియా. అక్కడ స్టోర్ల సంఖ్య దాదాపు 1870. ఇక జపాన్‌లో 1733, కెనడా 1458, బ్రిటన్ 1266, లాటిన్ అమెరికాలో 1649 స్టోర్లు ఉన్నాయని స్టార్‌బక్స్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 38,027 స్టార్‌బక్స్ స్టోర్ల ద్వారా కాఫీ, బెవరేజెస్‌ భిన్న రుచులను ఆస్వాదించొచ్చు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×