Unmarried Couple Rules: భారత్ లో పెళ్లి కాని జంటలకు సందేహాలు చాలా ఎక్కువ. మరి ముఖ్యంగా ఓయో (OYO) వంటి హోటల్స్ గదిలో ఇద్దరూ కలిసి గడపటం చట్టరిత్యా నేరమా? కాదా? అన్న సందేహాం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ ధైర్యం చేసి హెటల్ కు వెళ్తే పోలీసులు వస్తే ఏం చేయాలి? వారికి తమను అరెస్టు చేసే హక్కు ఉందా? లేదా? అనే సందేహాలు, భయాలు చాలామంది ప్రేమికుల్లో ఉన్నాయి. అయితే ఈ అంశంపై చట్టం ఏం చెబుతోంది? హోటళ్ల నిబంధనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారతీయ చట్టాల ప్రకారం ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో హోటల్ గదిలో కలిసి ఉండటం ఎలాంటి నేరం కాదు. కేవలం వివాహం కాలేదనే ఒకే ఒక్క కారణంతో ఇద్దరు వ్యక్తులు హోటల్‌లో ఉండటాన్ని ఏ చట్టమూ నిషేధించలేదు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను వివిధ సందర్భాల్లో దేశ అత్యున్నత న్యాయస్థానాలు సైతం సమర్థించాయి. కాబట్టి పెళ్లికాని జంటలు హోటల్‌లో బస చేయడం ముమ్మాటికీ చట్టబద్ధమే. అయితే 18 ఏళ్లలోపు మైనర్లకు మాత్రం చట్టం విధించే పరిమితులు వర్తిస్తాయి.
హోటల్ గదిలో పెళ్లికాని జంటలు ఉన్నంత మాత్రాన వారిని నేరస్థులుగా భావించి అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు లేదు. హోటల్ రూమ్ అనేది వ్యక్తిగత ప్రైవేట్ స్పేస్ కిందకే వస్తుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం అనుమానంతో గదుల్లోకి ప్రవేశించే హక్కు వారికి ఉండదు. అయితే ఆ గదిలో ఏదైనా చట్టవ్యతిరేక లేదా అక్రమ కార్యకలాపాలు జరుగుతుంటే మాత్రం అడ్డుకునే హక్కు పోలీసులకు పూర్తిగా ఉంది. మైనర్లు ఉండటం, వ్యభిచారం, డ్రగ్స్ వాడకం వంటివి జరుగుతున్నాయని తగిన ఆధారాలు ఉంటే మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
మేజర్లు అయిన జంట ఒకే గదిలో ఉండేందుకు చట్టం అనుమతించినప్పటికీ.. ప్రతీ హోటల్ ఇందుకు అంగీకరించాలన్న రూల్ ఏమి లేదు. ప్రతి హోటల్ యాజమాన్యానికి తమ సొంత నిబంధనలు (Check-in Policies) రూపొందించుకునే హక్కు ఉంటుంది. కొన్ని హోటళ్లు పెళ్లికాని జంటలకు గదులు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అనుమానస్పదంగా ఉన్న ప్రేమికులను తమ హోటల్ లో బస చేసేందుకు నిరాకరించే హక్కు వాటికి ఉంది. కాబట్టి తమకు రూమ్ ఎందుకు ఇవ్వలేదని ఆ జంట క్వశ్చన్ చేసే హక్కు ఈ సందర్భాల్లో ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది హోటల్ యాజమాన్యాల వ్యాపార పరమైన నిబంధన మాత్రమే తప్ప.. దీనిని చట్టపరమైన నిషేధంగా భావించకూడదని పేర్కొంటున్నారు.
Also Read: BSNL రూ. 485 vs Jio రూ. 749.. 72 రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు ఏ ప్లాన్ బెస్ట్?
హోటల్ బుకింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండటానికి పెళ్లికాని జంటలు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. రూమ్ బుక్ చేసుకునే ముందు సదరు హోటల్ పెళ్లికాని జంటలను అనుమతిస్తుందో లేదో, అలాగే లోకల్ గుర్తింపు కార్డులను అంగీకరిస్తుందో లేదో స్పష్టంగా తెలుసుకంటే బెటర్. మరోవైపు గదిలో బస చేసే ఇద్దరు వ్యక్తుల వద్ద ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులు (ఆధార్, ఓటర్ ఐడీ) ఖచ్చితంగా ఉండాలి.
Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా రీఛార్జ్ టెన్షన్ ఉండదు!