E-Paper
Advertisement

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. పైకప్పులో పగుళ్లు, పలువురికి గాయాలు, అసలేం జరిగింది?

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. పైకప్పులో పగుళ్లు, పలువురికి గాయాలు, అసలేం జరిగింది?
Advertisement

Air India flight: ఎయిర్ ఇండియా విమానం మంగళవారం భారీ కుదుపులకు లోనైంది. బలమైన గాలుల కారణంగా విమానం వణికిపోయింది. పరిస్థితి గమనించిన పైలట్ పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో  పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అసలేం జరిగింది?

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు

ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం AI 2379 భారీ కుదుపులకు లోనైంది.  విమానం ఆకాశంలో ఉండగా బలమైన గాలుల కారణంగా విమానం వణికిపోయింది. ఫలితంగా కేబిన్ లోపల పగుళ్లు ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించిన పైలట్, విమానాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

Advertisement

ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు-సిబ్బందితో సహా  12 మంది గాయపడ్డారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విమానం నుంచి ప్రయాణికులు దిగగానే గాయపడిన వారిని పరీక్షలు నిర్వహించారు. పలువుర్ని ఎయిర్‌పోర్టులో వైద్య కేంద్రానికి తరలించారు. ప్రయాణీకులు-సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా పేర్కొంది.

పైకప్పులో పగుళ్లు..  పలువురికి గాయాలు

జరిగిన ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. కుదుపుల తర్వాత తీసిన విమాన ట్రావెలర్లు తీసిన ఫోటోలు, విమానం పైకప్పు ప్యానెళ్లలో పగుళ్లు కనిపించాయి. విమానంలో ప్రయాణికుడు కొన్ని విషయాలు బయటపెట్టాడు. విమానం బయలుదేరి తర్వాత గంటన్నర అవుతోంది.

Advertisement

తెల్లవారుజామున నిద్రపోతున్నామని, ఉన్నట్లుండి  విమానం ఆగిపోయి వెనక్కి తిరిగినట్టు అనిపించిందన్నాడు. దాదాపు 2 నుంచి 3 నిమిషాల పాటు విమానంలో కుదుపులకు గురైందని తెలిపాడు. దాదాపు 15 నుంచి 20 మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలిపాడు. ఘటన సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

కుదుపులకు కారణమేంటి?

గాలి ప్రవాహంలో ఆకస్మిక మార్పు కారణంగా విమానం కుదుపులకు లోనవుతుంటుంది. దాన్ని అల్లకల్లోలంగా చెబుతారు. ఈ సమయంలో విమానం పైకి కిందకి, లేకుంటే ఎడమ నుంచి కుడి వైపు ఊగవచ్చు. కొన్నిసార్లు కొన్ని అడుగులు కిందకు రావచ్చు. ఈ కారణంగా ప్రయాణికులకు విమానం కిందకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. విమానం స్థిరంగా ఎగరడానికి దాని రెక్కల పైన-కింద సమానమైన గాలి ప్రవాహం అవసరం ఉంటుంది. వాతావరణంలో బలమైన గాలులు లేదా ఇతర కారణాల వల్ల ఈ ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు, గాలి బుడగలు ఏర్పడతాయి. ఇవే గాలిలో అల్లకల్లోలానికి కారణమవుతాయని పలువురు చెబుతున్నారు.

తీవ్రతను బట్టి మూడు రకాలు ఉంటాయి.

1. స్వల్ప కుదుపు- విమానం ఓ మీటరు వరకు పైకి కిందకి కదులుతూ వుంటుంది. కానీ ప్రయాణికులు దానిని గమనించరు.

2. మిడిల్ స్థాయి కుదుపు: విమానం 3 నుంచి 6 మీటర్ల మేరా పైకి కిందకి కదులుతూ ఉంటుంది. దీనివల్ల నీరు కిందికి ఒలికిపోవచ్చు.

3. తీవ్రమైన కుదుపు:  విమానం 30 మీటర్ల వరకు పైకి కిందకి ఊగే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు సీట్ బెల్టులు పెట్టుకోకపోతే వారు వారు తమ సీట్ల నుండి ఎగిరి కింద పడే అవకాశం ఉంటుంది.

ALSO READ: హోటల్లో ప్రేమికులు ఉండొచ్చా? పోలీసులకు అడ్డుకునే హక్కు లేదా? చట్టం ఏం చెబుతోంది!

 

Related News

హోటల్లో ప్రేమికులు ఉండొచ్చా? పోలీసులకు అడ్డుకునే హక్కు లేదా? చట్టం ఏం చెబుతోంది!

ఆ రాష్ట్రానికి నో హై స్పీడ్ రైల్.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

ఐఆర్‌సిటీసీ క్యాటరింగ్‌ కు షాక్.. ఏకంగా రూ.5.13 కోట్ల ఫైన్!

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

Big Stories

Advertisement
×