E-Paper
Advertisement

కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!

కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!
Advertisement

MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. సినీ నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారన్న ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్రాస్  హైకోర్టు ఆదేశాలతో ఆయన విడుదల సైతం అయ్యారు. అయితే తన కుమారుడు అరెస్టును ఖండిస్తూ మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కె స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు.

‘విజయ్.. రీల్స్ క్రియేటర్’

తమిళనాడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ అరెస్టు జరగడం వెనుక రాజకీయం ఉందని ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు పాల్గొనకుండా చేసేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాత వాగ్దానాలను నెరవేర్చకుండా సీఎం విజయ్ కేవలం ‘రీల్స్ క్రియేటర్’లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా తన బాధ్యతలను గుర్తించి పనిచేయాలని ఆయన హితవు పలికారు.

Advertisement

ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులా?

అటు డీఎంకే పార్టీ సైతం ఎక్స్ వేదికగా అరెస్టు వ్యవహారంపై స్పందించింది. సీఎం విజయ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను, తన ప్రభుత్వాన్ని విమర్శించే వారిని వరుసగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించింది. సోషల్ మీడియా పోస్టులు, వీడియో ప్రకటనలను సాకుగా చూపిస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు అజిత రాధాకృష్ణన్, మార్కండేయన్ కూడా వేధించారని పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై దాడులు చేయడం, చెన్నై మెరీనా బీచ్‌ను మూసివేయడం వంటి చర్యలు ఫాసిజానికి పరాకాష్ట అని మండిపడింది.

Advertisement

అసలేంటీ వివాదం?

ఉదయనిధి – త్రిష వివాదం విషయానికి వస్తే.. తంజావూరులో కావేరి జలాల సమస్యపై మాట్లాడుతూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు డీఎంకే కార్యకర్తలు ‘త్రిష, త్రిష’ అని నినాదాలు చేశారు. ఈ సమయంలో ఉదయనిధి చేసిన కొన్ని వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్నాయని టీవీకే ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రముఖ గాయని చిన్మయి, బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపట్టారు.

Also Read: మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

హైకోర్టు జోక్యంతో విడుదల

ఈ వివాదం సృష్టించిన కలకలం కారణంగా ఉదయనిధి స్టాలిన్‌పై ‘మహిళా వేధింపుల నిరోధక చట్టం’ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అశ్లీల పదజాలం ఉపయోగించడం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, అల్లర్లను ప్రోత్సహించడం వంటి ఆరోపణలను ఆయనపై మోపారు. అయితే ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయడంతో.. విచారణ పూర్తయిన తర్వాత ఆయనను పోలీసులు విడుదల చేశారు.

Also Read: భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్.. వీసా పొడిగింపు పైనా ‘బాదుడే బాదుడు’!

Tags

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×