E-Paper
Advertisement

BSNL మరో చౌకైన ప్లాన్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా రీఛార్జ్ టెన్షన్ ఉండదు!

BSNL మరో చౌకైన ప్లాన్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా రీఛార్జ్ టెన్షన్ ఉండదు!
Advertisement

BSNL Rs 2799 Annual Plan: మొబైల్ రీఛార్జ్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో వినియోగదారులు చవకైన, ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన చందాదారుల కోసం ఒక ఆకర్షణీయమైన వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరలో ఏడాదిపాటు భారీ డేటా, ఫ్రీ కాల్స్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ ప్లాన్ కు సంబంధించి డిటైయిల్స్ ఈ కథనంలో చూద్దాం.

ఇంతకీ ప్లాన్ ఏంటంటే?

లాంగ్ టర్మ్ రీఛార్జ్ విభాగంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.2,799 ప్లాన్.. యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్.. ఏడాదంతా ఫ్రీకాల్స్, డేటాను అందిస్తుంది. ప్రతిరోజూ 3GB హై స్పీడ్ డేటాను యూజర్లు పొందొచ్చు. అంటే ఏడాదికి మొత్తం 1,095 GB వరకు డేటా లభించనుంది. ఇక దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఫ్రీగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవడంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు.

అదనపు బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ను సైతం అందిస్తోంది. వినియోగదారులు ‘BSNL Tunes’ సేవలను ఉచితంగా పొందొచ్చు. దీనివల్ల మీకు నచ్చిన కాలర్ ట్యూన్‌ను సులువుగా సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. అటు రోమింగ్ ఛార్జీల భయం లేకుండా దేశవ్యాప్తంగా ఉచితంగా నేషనల్ రోమింగ్ సేవలను సైతం ఈ ప్లాన్ లో సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ వల్ల ఎవరికి లాభం?

రోజూ 3GB డేటా లభిస్తుండటం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులకు ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఓటీటీలు ఎక్కువగా చూసేవారు, యూట్యూబ్ స్ట్రీమింగ్ లో సమయం గడిపేవారికి సైతం ఇది పర్ఫెక్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ప్రైవేటు కంపెనీల 365 రోజుల ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తున్నందువల్ల సామాన్యులు సైతం ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. రోజుకు వారికి రూ. 7.66 మాత్రమే ఖర్చవుతుంది. అంటే దాదాపు రూ.8 అన్నమాట.

Advertisement

Also Read: రూ.400 కే లైవ్ టీవీ, వైఫై, ఓటీటీ.. జియో నుంచి సరికొత్త ‘జియోహోమ్’ ప్యాక్‌లు!

ఈ ప్లాన్‌ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

ఈ ప్లాన్‌ను వినియోగదారులు చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ‘BSNL Selfcare’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. నంబర్‌ ఎంటర్ చేసి రూ. 2,799 ప్లాన్‌ ఎంచుకుని రీఛార్జ్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోని రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లి కూడా రూ. 2,799 ప్లాన్ ను దక్కించుకోవచ్చు.

Also Read: జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

Tags

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×