E-Paper
Advertisement

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!
Advertisement

Samsung Galaxy Ring: టెక్ దిగ్గజం శాంసంగ్ తమ పాపులర్ Galaxy Ring యూజర్ల కోసం ఒక కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతిసారీ రింగ్‌ను ఛార్జింగ్ కేస్‌లో పెట్టాల్సిన అవసరం లేకుండా, నేరుగా గెలాక్సీ ఫోన్ నుంచే ఛార్జ్ చేసుకునే వెసులుబాటు రానుంది. అమెరికా పేటెంట్ ఆఫీస్‌లో సాంసంగ్ దాఖలు చేసిన ఒక నివేదిక ద్వారా ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఇది కేవలం కంపెనీ యొక్క పేటెంట్ ఆలోచన మాత్రమే అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

చేతికి పెట్టుకునే ఛార్జింగ్..

ఈ పేటెంట్ సమాచారం ప్రకారం.. యూజర్లు రింగ్‌ను వేలికి పెట్టుకుని ఫోన్ పట్టుకున్నప్పుడే అది ఛార్జ్ అవుతుంది. రింగ్‌లో ఛార్జింగ్ తగ్గగానే ఫోన్‌కు సిగ్నల్ వెళ్తుంది. ఫోన్, రింగ్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్లు గుర్తించగానే ‘రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్’ ద్వారా పవర్ ట్రాన్స్‌ఫర్ మొదలవుతుంది. బ్లూటూత్ ఆధారంగా ఇవి ఎంత దూరంలో ఉన్నాయో ఫోన్ అంచనా వేస్తుంది. ఒకవేళ రింగ్ దూరంగా జరిగితే ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.

Advertisement

Also Read: రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ..

ఈ ప్రాసెస్ సురక్షితంగా జరగడానికి శాంసంగ్ ప్రత్యేక భద్రతా ఫీచర్లను రూపొందించింది. ఫోన్ బ్యాటరీ ఎంత ఉంది? డివైజ్ వేడెక్కిందా లేదా? రింగ్ సరిగ్గా ఉందా.. అనే విషయాలను చెక్ చేశాకే ఛార్జింగ్ మొదలవుతుంది. అంతేకాకుండా.. ఫోన్ లాక్ చేసి ఉన్నా సరే ఛార్జింగ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. రింగ్ ఛార్జింగ్ శాతాన్ని ఫోన్ స్క్రీన్ పైనే క్లియర్‌గా చూపిస్తుంది.

మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

Advertisement

ప్రస్తుతానికి ఇది కేవలం ఒక పేటెంట్ ఆలోచన మాత్రమే. సాధారణంగా టెక్ కంపెనీలు ఎన్నో రకాల కొత్త ఆలోచనలకు పేటెంట్లు తీసుకుంటాయి. కానీ అవన్నీ మార్కెట్‌లోకి వస్తాయని చెప్పలేం. ఒకవేళ శాంసంగ్ ఈ టెక్నాలజీని నిజంగానే ఉత్పత్తుల్లోకి తీసుకొస్తే.. స్మార్ట్ రింగ్స్ వాడే విధానం పూర్తిగా మారిపోతుందనడంలో సందేహం లేదు.

Also Read: నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×