E-Paper
Advertisement

BSNL రూ. 485 vs Jio రూ. 749.. 72 రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు ఏ ప్లాన్ బెస్ట్?

BSNL రూ. 485 vs Jio రూ. 749.. 72 రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు ఏ ప్లాన్ బెస్ట్?
Advertisement

Recharge Comparison: ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో వచ్చే చౌకైన రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే బీఎస్ఎన్ఎల్ (BSNL) రూ. 485, రిలయన్స్ జియో (Jio) రూ. 749 ప్లాన్లు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. బడ్జెట్ పరంగా రెండు ప్లాన్ల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఈ రెండూ 72 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండటం విశేషం. అయితే బెనిఫిట్స్ పరంగా కూడా రెండూ ప్లాన్ల మధ్య చాలా వ్యత్యాసం కూడా ఉంది. కాబట్టి ఈ రెండు ప్లాన్ల వివరాలు.. బెనిఫిట్స్ పరంగా ఏది పైచేయి సాధిస్తుందో ఈ కథనంలో పరిశీలిద్దాం.

BSNL రూ. 485 రీఛార్జ్ ప్లాన్

బడ్జెట్ యూజర్లను దృష్టిపెట్టుకొని బీఎస్ఎన్ఎల్ ఈ రూ. 485 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా లభిస్తుంది. రోజూవారీ డేటా లిమిట్ అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకి తగ్గనుంది. ఇక దేశవ్యాప్తంగా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ కింద చేసుకోవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఓటీటీ బెనిఫిట్స్, ఫ్రీ సబ్ స్క్రిప్షన్స్ లేకపోవడం గమనార్హం.

Jio రూ. 749 రీఛార్జ్ ప్లాన్

Advertisement

ఇక జియో విషయానికి వస్తే.. ఈ దిగ్గజ టెలికాం సంస్థ రూ. 749 ప్లాన్ లో అడిషనల్ బెనిఫిట్స్ ను బాగా ఇస్తోంది. ముందుగా బీఎస్ఎన్ఎల్ తరహాలోనే 72 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు వ్యాలిడిటీ కాలమంతటికీ అదనంగా మరో 20 GB డేటా ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. అదనపు బెనిఫిట్స్ కింద.. ఈ ప్లాన్ లో 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ ప్యాక్, జియో టీవీ, అర్హులైన యూజర్లకు 5TB క్లౌడ్ స్టోరేజ్ కి ఫ్రీ యాక్సెస్ లభించనుంది. అలాగే AI ఫీచర్లతో కూడిన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ కూడా అందనుంది. అది కాకుండా జియో 5G నెట్‌వర్క్ పరిధిలో ఉన్న ప్రాంతాల యూజర్లకు అపరిమిత 5G డేటా కూడా పొందొచ్చు.

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా రీఛార్జ్ టెన్షన్ ఉండదు!

ఏ ప్లాన్ ఎవరికి బెస్ట్?

Advertisement

ఈ రెండు ప్లాన్‌లలో 72 రోజుల వ్యాలిడిటీ, కాల్స్, SMSలు, రోజువారీ 2GB డేటా కామన్‌గా ఉన్నప్పటికీ.. అడిషనల్ బెనిఫిట్స్ పరంగా చాలా తేడా ఉంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ తో పోలిస్తే జియో ప్లాన్ రూ. 264 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ లో కేవలం ఫ్రీ కాల్స్, డేటా కోరుకుంటే BSNL రూ. 485 ప్లాన్ బెస్ట్ ఛాయిస్. అలాకాకుండా ఓటీటీ బెనిఫిట్స్, అదనపు డేటా, క్లౌడ్ స్టోరేజ్, AI ఫీచర్లు, అపరిమిత 5G స్పీడ్ కావాలనుకుంటే మాత్రం జియో రూ. 749 ప్లాన్ ఎంచుకోవడం మంచిది.

Also Read: రూ.400 కే లైవ్ టీవీ, వైఫై, ఓటీటీ.. జియో నుంచి సరికొత్త ‘జియోహోమ్’ ప్యాక్‌లు!

Tags

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×