E-Paper
Advertisement

ఆ రాష్ట్రానికి నో హై స్పీడ్ రైల్.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

ఆ రాష్ట్రానికి నో హై స్పీడ్ రైల్.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
Advertisement

Kerala High Speed Rail: దేశ వ్యాప్తంగా హైస్పీడ్ రైల్వే కారిడార్లను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా మరో 8 కారిడార్లను నిర్మించాలని భావిస్తోంది. అయితే, కేరళలో హైస్పీడ్,సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు ప్రస్తుతం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రాజ్యసభకు తెలిపారు. సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కీలక వివరాలు తెలిపారు.

ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం!

కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై సమగ్రంగా పరిశీలించి, ప్రస్తుతం ఉన్న రూపంలో ఆ ప్రాజెక్టును అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడిందని రైల్వేమంత్రి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే ఇప్పటి వరకు ఎలాంటి హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వలేదని కేంద్రం వెల్లడించింది. అయితే, ఈ సమాధానంపై ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళకు సంబంధించిన అన్ని హైస్పీడ్ రైలు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వరుసగా తిరస్కరిస్తోందని ఆరోపించారు. సిల్వర్‌ లైన్ ప్రాజెక్టును పక్కన పెట్టడమే కాకుండా, మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్ సూచించిన ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని విమర్శించారు. కొత్త హైస్పీడ్, సెమీ హైస్పీడ్ కారిడార్‌ పై కూడా ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కేంద్రం ఏం చెప్పిందంటే?

Advertisement

అదే సమయంలో, కేరళలో ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా అభివృద్ధి చేసే అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇందులో షోరనూర్–మంగళూరు, ఎర్నాకులం–కాయంకుళం, కాయంకుళం–తిరువనంతపురం లాంటి కీలక మార్గాలు ఉన్నాయి. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.

రైల్వే ప్రాజెక్టుల అమలులో భూసేకరణ పెద్ద సమస్యగా మారిందని కూడా కేంద్రం వెల్లడించింది. కేరళలో కొనసాగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 476 హెక్టార్ల భూమి అవసరమని, అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 65 హెక్టార్లు మాత్రమే రైల్వేకు అప్పగించిందని తెలిపింది. ఇది మొత్తం అవసరమైన భూమిలో కేవలం 14 శాతం మాత్రమేనని తెలిపింది. భూసేకరణలో జాప్యం వల్లే పలు ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది.

Advertisement

ఇదే సందర్భంగా పాలక్కాడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అంశం కూడా చర్చకు వచ్చింది. 2012-13 రైల్వే బడ్జెట్‌ లో ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్ యూనిట్లు, భవిష్యత్‌ లో ఏర్పాటు కానున్న ఫ్యాక్టరీలు దేశ అవసరాలను తీర్చడానికి సరిపోతాయని కేంద్రం తెలిపింది. అందువల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది.

Read Also: ఐఆర్‌సిటీసీ క్యాటరింగ్‌ కు షాక్.. ఏకంగా రూ.5.13 కోట్ల ఫైన్!

Tags

Related News

హోటల్లో ప్రేమికులు ఉండొచ్చా? పోలీసులకు అడ్డుకునే హక్కు లేదా? చట్టం ఏం చెబుతోంది!

ఐఆర్‌సిటీసీ క్యాటరింగ్‌ కు షాక్.. ఏకంగా రూ.5.13 కోట్ల ఫైన్!

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

Big Stories

Advertisement
×