BigTV English

Trains Diverted: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?

Trains Diverted: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు  డైవర్ట్, కారణం ఏంటంటే?

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లన హైదరాబాద్ లో వివిధ రైల్వే స్టేషన్ల నుంచి నడిపించనున్నట్లు తెలిపారు. మొత్తం 18 రైళ్లను సికింద్రాబాద్ నుంచి రైట్ డైవర్ట్ చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 26 వరకు ఈ డైవర్షన్ కొనసాగనున్నట్లు తెలిపారు.


రైళ్ల డైవర్షన్ ఎందుకుంటే?

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో పలు రైళ్లను ఇప్పటికే హైదరాబాద్ లోని పలు రైల్వే స్టేషన్ల నడిపిస్తున్నారు. తాజాగా మరో 18 రైళ్లను కూడా ఇతర స్టేషన్ల నుంచి ఆపరేషన్స్ కొనసాగిచనున్నట్లు తెలిపారు. ఈ 18 రైళ్లు మల్కాజ్‌ గిరి, హైదరాబాద్ (నాంపల్లి), చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు ఆయా రైళ్లు ఎక్కడి నుంచి నడుస్తున్నాయో తెలుసుకుని ప్రయాణీకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ మేరకు 18 రైళ్లలు ఎక్కడ నుంచి ఎప్పుడు బయల్దేరుతాయి అనే వివరాలను అధికారికంగా ప్రకటించారు.


ఏ రైళ్లు ఏ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తాయంటే?

సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ 18 రైళ్లు ఇప్పుడు సికింద్రాబాద్‌కు బదులుగా మల్కాజ్‌ గిరి, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి.

⦿ మల్కాజ్‌గిరి స్టేషన్: 77656, 77653, 77654, 77655 (సికింద్రాబాద్-సిద్దిపేట రూట్లు) రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి.

⦿ హైదరాబాద్ దక్కన్ (నాంపల్లి): 12025/12026 (పుణె-సికింద్రాబాద్-పుణె) రైళ్లు ఈ టెర్మినల్ నుండి ఆపరేషన్స్ కొనసాగిస్తాయి.

⦿ చర్లపల్లి స్టేషన్: సికింద్రాబాద్–సిల్చార్ (12513/12514), సికింద్రాబాద్–దర్భంగా (17007/17008), సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ (12735/12736), సికింద్రాబాద్–అగర్తల (07030/07029), సికింద్రాబాద్–ముజఫర్‌పూర్ (05293/05294),   హైదరాబాద్–రక్సౌల్ (07051/07052) లాంటి సుదూర రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి.

Read Also: కుండపోత వర్షాలు, రాష్ట్రంలో పలు రైళ్లు రద్దు!

రైళ్ల దారిమళ్లింపు నేపథ్యంలో ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ తాత్కాలిక ఏర్పాట్లను గమనించి, ఇందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.

Read Also: కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నమ్మకపోతే ఈ వీడియో చూడండి!

Related News

Seaplane Services: అక్టోబర్ నాటికి సీప్లేన్ సేవలు.. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!

Trains Cancelled: కుండపోత వర్షాలు, రాష్ట్రంలో పలు రైళ్లు రద్దు!

Railway updates: భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో పలు రైళ్ల దారి మళ్లింపు!

Secunderabad Railway Station: కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నమ్మకపోతే ఈ వీడియో చూడండి!

Trains Cancelled: 22 రైళ్లు రద్దు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!

Big Stories

×