SCR Cancels Trains: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్స్ మీదికి వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు ఆయా రైళ్లకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని బికనూర్- తలమడ్ల, అనేక్ పేట్ – మెదక్ రైల్వే ట్రాక్ పైనుంచి వరద ప్రవహిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైళ్ల రద్దుకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇప్పటి వరకు 8 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ఒక రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. 5 రైళ్లను దారిమళ్లించగా, రెండు రైళ్ల షెడ్యూల్ మార్చినట్లు వివరించారు.
పూర్తి రద్దు అయిన రైళ్ల వివరాలు
⦿ కరీంనగర్ – కాచిగూడ(77650) ఇవాళ రద్దు
⦿ కాచిగూడ – నిజామాబాద్(77643) ఇవాళ రద్దు
⦿ మెదక్ – కాచిగూడ(57302) ఇవాళ రద్దు
⦿ కాచిగూడ – మెదక్ (77603) ఇవాళ రద్దు
⦿ మెదక్ – కాచిగూడ (77604) రేపు రద్దు
⦿ బోధన్ – కాచిగూడ (57414) రేపు రద్దు
⦿ ఆదిలాబాద్ – తిరుపతి (17406) ఇవాళ రద్దు
⦿ నిజామాబాద్ – కాచిగూడ(77644) రేపు రద్దు
తాత్కాలిక రద్దు చేసిన రైళ్లు
⦿ మహబూబ్ నగర్ – కాచిగూడ(77642) ఇవాళ రద్దు
రూట్ డైవర్ట్ చేసిన రైళ్ళ వివరాలు
⦿ రాయచూర్ – పర్బాని(17663): వికారాబాద్- పర్లి వైజ్యనాథ్- పూర్ణ మీదుగా దారి మళ్లింపు.
⦿ నాందేడ్ – రాయచూర్ (17664): నాందేడ్- పూర్ణ- పర్లి వైజ్యనాథ్- వికారాబాద్ మీదుగా దారి మళ్లింపు.
⦿ బికనీర్ – కాచిగూడ (07054): పూర్ణ- పర్బాని-పర్లి వైజ్యనాథ్-వికారాబాద్- సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లింపు.
⦿ హిసార్ – హైదరాబాద్ (17019): పర్బాని-పర్లి వైజ్యనాథ్- వికారాబాద్-హుస్సేన్ సాగర్ జంక్షన్-హైదరాబాద్ దక్కన్ మీదుగా మళ్లింపు.
⦿ మన్మాడ్ – కాచిగూడ (అజంతా ఎక్స్ ప్రెస్)(17063): పర్బాని- పర్లి వైజ్యనాథ్-వికారాబాద్- సికింద్రాబాద్ మీదుగా మళ్లింపు.
Read Also: 22 రైళ్లు రద్దు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
రీ -షెడ్యూల్ చేసిన రైళ్ళ వివరాలు
⦿ లింగంపల్లి – కాకినాడ ( గౌతమి ఎక్స్ ప్రెస్)
⦿ కాచిగూడ – భగత్ కి కోటి
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ రైళ్ల వివరాలు తెలుసుకుని ప్రయాణాలు కొనసాగించాలని రైల్వే అధికారులు సూచించారు. అవసరం అయితే హెల్ఫ్ డెస్క్ ను సంప్రదించాలన్నారు.
Read Also: కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నమ్మకపోతే ఈ వీడియో చూడండి!