BigTV English

Spirit Update: మళ్లీ వాయిదా పడ్డ స్పిరిట్ షూటింగ్.. ఈసారి ఏమైందంటే?

Spirit Update: మళ్లీ వాయిదా పడ్డ స్పిరిట్ షూటింగ్.. ఈసారి ఏమైందంటే?

Spirit Update: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ది రాజా సాబ్ (The Raja Saab) సినిమాతో పాటు ఫౌజీ (Fauji) సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) తో పాటూ కల్కి 2 (Kalki 2) , సలార్ 2(Salaar 2) వంటి చిత్రాలను కూడా లైన్ లో పెట్టారు. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగాతో చేయాల్సిన స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


మళ్లీ వాయిదా పడ్డ స్పిరిట్ షూటింగ్..

అసలు విషయంలోకి వెళ్తే.. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ప్రకటించారు. మొదట ఈ సినిమా టెస్ట్ షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారం మొదలవుతుందని ప్రకటించారు.. ఆ తర్వాత అక్టోబర్ అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఎప్పుడో మొదలు కావలసిన ఈ సినిమా ఇప్పుడు పదే పదే వాయిదా పడుతుండడంతో అటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


నిరాశలో ఫ్యాన్స్..

ముఖ్యంగా తొలిసారి ప్రభాస్ ను ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అందరికీ పరిచయం చేయబోతున్నారు సందీప్ రెడ్డివంగా. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాంటి ఈ సినిమా షూటింగు ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మొదట ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) ను హీరోయిన్ గా ఎంచుకొని కొన్ని కారణాల చేత ఆమెను తప్పించి.. ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti dimri)ని ఎంపిక చేసుకున్నారు. వరుసగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మరి డిసెంబర్ లోనైనా పట్టాలెక్కుతుందేమో చూడాలి.

స్పిరిట్ షూటింగ్ వాయిదా పడడానికి కారణం..?

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పదే పదే వాయిదా పడడానికి కారణం ప్రభాస్ అని సమాచారం. ప్రస్తుతం ఆయన మారుతీ (Maruthi ) దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల చేస్తామని మొదట ప్రకటించినా.. ప్రస్తుతం కొన్ని సీన్స్ చేస్తుండడం వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. కాబట్టి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తూ అక్కడ బిజీగా ఉన్నారు. మరొకవైపు హను రాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాల కారణంగా స్పిరిట్ మూవీకి డేట్స్ కేటాయించలేకపోతున్నారని, అందుకే డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం.

ALSO READ:Jayam Ravi: ముదురుతున్న యవ్వారం.. ప్రేయసిపై హీరో ప్రశంసలు!

Related News

Hero Madhavan : భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

Gv Prakash: జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం అతనేనా..? అస్సలు ఊహించి ఉండరు..

Pa.Ranjith: ఆస్కార్ ఎంట్రీ పొందిన పా.రంజిత్ మూవీ.. తొలి సినిమాగా రికార్డ్!

Lakshmi Menon: కిడ్నాప్ కేసులో హీరోయిన్ కి భారీ ఊరట.. అసలేం జరిగిందంటే?

Nivetha Pethuraj : బిజినెస్ మ్యాన్ తో హీరోయిన్ పెళ్లి ఫిక్స్.. త్వరలోనే డేట్ అనౌన్స్..?

Big Stories

×