E-Paper
Advertisement

భారత్‌లోనే విదేశీ అందాలు.. ఈ 5 ప్రదేశాలను చూస్తే స్విట్జర్లాండ్ వెళ్లినట్లే ఫీలవుతారు!

భారత్‌లోనే విదేశీ అందాలు.. ఈ 5 ప్రదేశాలను చూస్తే స్విట్జర్లాండ్ వెళ్లినట్లే ఫీలవుతారు!
Advertisement

Beautiful Places in India: ఒకవైపు మంచుతో కప్పుకున్న కొండలు.. మరోవైపు స్విట్జర్లాండ్‌ను తలపించే పచ్చని లోయలు.. ఇంకోవైపు ఫ్రాన్స్ వీధులను గుర్తు చేసే రంగురంగుల భవనాలు. ఇవన్నీ విదేశాల్లో ఉన్నాయని అనుకుంటున్నారా? అస్సలు కాదు.. మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇలాంటి అందమైన ప్రదేశాలను చూడటానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ అద్భుతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. మరి విదేశీ పర్యాటక ప్రాంతాలను తలపించే ఆ 5 అందమైన ప్రదేశాలు ఎక్కడున్నాయి? అక్కడ చూడాల్సిన విశేషాలేంటో తెలుసుకుందాం పదండి..

ఔలి, ఉత్తరాఖండ్

స్విట్జర్లాండ్‌ను తలపించే అందమైన ప్రదేశం ఔలి. ఇక్కడ ఎత్తైన హిమాలయ పర్వతాలు, మంచుతో కప్పుకున్న కొండలు, పచ్చని మైదానాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో మంచు క్రీడలను ఆస్వాదించడానికి చాలామంది ఇక్కడికి వస్తారు. కేబుల్ కారులో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపాలనుకునేవారికి ఔలి మంచి ఎంపిక.

మున్నార్, కేరళ

Advertisement

పచ్చని తేయాకు తోటలు, కొండల మధ్య నుంచి వచ్చే పొగమంచు మున్నార్ అందాలను మరింత పెంచుతాయి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు స్కాట్లాండ్‌లోని పచ్చని కొండలను గుర్తు చేస్తాయి. ఎరవికులం జాతీయ ఉద్యానవనం, మట్టుపెట్టి ఆనకట్ట, టాప్ స్టేషన్ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. చల్లని వాతావరణం, అందమైన కొండలు, ప్రశాంతమైన పరిసరాలు కుటుంబంతో ప్రయాణించేవారికి ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

Also Read: హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

పుదుచ్చేరి

Advertisement

ఫ్రాన్స్‌లోని కొన్ని నగరాలను గుర్తు చేసే వీధులు పుదుచ్చేరి ప్రత్యేకత. ఇక్కడి వైట్ టౌన్ ప్రాంతంలో పసుపు, తెలుపు రంగుల్లో కనిపించే భవనాలు, చిన్న కేఫ్‌లు, ఫ్రెంచ్ నిర్మాణ శైలి పర్యాటకులను ఆకర్షిస్తాయి. సముద్ర తీరంలో నడుస్తూ సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు. భారతీయ, ఫ్రెంచ్ సంస్కృతుల కలయికను చూడాలనుకునేవారికి పుదుచ్చేరి మంచి పర్యాటక ప్రాంతం.

షిల్లాంగ్, మేఘాలయ

స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రసిద్ధి చెందిన షిల్లాంగ్ ప్రకృతి అందాలకు నిలయం. పచ్చని కొండలు, పొగమంచుతో నిండిన ఉదయాలు, అందమైన లోయలు ఇక్కడి ప్రత్యేకతలు. ఉమియం సరస్సు, ఎలిఫెంట్ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునేవారు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్

విదేశీ పర్వత ప్రాంతాలను తలపించే మరో ప్రదేశం స్పితి వ్యాలీ. ఇక్కడ రాతి కొండలు, విస్తారమైన లోయలు, అందమైన సరస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కీ మఠం, కాజా, చంద్రతాల్ సరస్సు చూడదగిన ప్రదేశాలు. అయితే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవాలి.

Also Read: పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Tags

Related News

మారనున్న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌ రూపురేఖలు.. రూ.197 కోట్లతో అభివృద్ధి పనులు!

బెంగళూరు నుంచి గోవాకు కొత్త వందే భారత్.. ప్రారంభం ఎప్పుడంటే?

ఢిల్లీకి మరో కొత్త వందే భారత్ రైలు.. రూట్, స్టాప్స్, టైమింగ్స్ ఇవే!

ఇండియాలో పర్యటించే విదేశీయులకు ఈ 5 ప్రదేశాల్లో అనుమతి లేదు.. కారణాలు ఇవే

శరవేగంగా నల్లగొండ రింగ్ రోడ్డు పనులు.. పూర్తయితే ఎన్నో లాభాలు!

స్పెయిన్ రైలు ప్రమాదం.. భారత్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు ఇది ఒక హెచ్చరికనా?

ఎయిర్‌పోర్ట్‌ కే కాదు.. ఇక సిటీలోనూ పుష్పక్ బస్సులు, టికెట్ ధర ఎంత అంటే!

Big Stories

Advertisement
×