Bullet Train Safety: ఒక్కసారి ఇమాజిన్ చేయండి గంటకు 300km ల వేగంతో దూసుకెళ్తున్న ఒక బుల్లెట్ ట్రైన్ కు అదే ట్రాక్ పై మరో ట్రైన్ దూసుకొస్తే ఏం జరుగుతుంది? ఆ స్పీడ్ లో సడన్ బ్రేకులు వేసిన రైల్ వెంటనే ఆగిపోతుందా? స్పెయిన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్పెయిన్ లో జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇప్పుడు భారత్ కూడా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఢీకొన్న రెండు హైస్పీడ్ రైలు..
స్పెయిన్ లోని టోలేడా ప్రాంతం సమీపంలో అక్టోబర్ 28న రెండు హై స్పీడ్ రైలు డీకొన్నాయి. ఒకటి ప్రభుత్వ రంగానికి చెందిన రైన్ఫే రైలు మరొకటి ప్రైవేట్ ఆపరేటర్ ఇరియో మెయింటైన్ చేస్తున్న రైలు. ఇరియో రైలు ట్రాక్ పై ఆగిన్నప్పుడు వెనుక నుంచి వచ్చిన రైన్ఫే రైలు దాన్ని దీకొట్టింది. ఈ ప్రమాదంలో కొన్ని భోగీలు పట్టాలు తప్పి రైల్వే ట్రాక్ పక్కకి వరిగిపోయింది. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రమాదానికి కారణం రైల్వే సిగ్నలింగ్ ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టం లో సమస్య తలెత్తడం. దాంతో రైళ్ల రాకపోకలను నియంత్రించే వ్యవస్థలో ఒక గ్లిచ్ వచ్చింది. దీంతో ట్రైన్స్ ను మాన్యువల్ గా నడుపుతున్నారు. ఆ టైంలోనే కమాండ్ కంట్రోల్ నుంచి వెళ్ళిన ఆదేశాలే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు.
టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం..
సాధారణంగా హై స్పీడ్ రైళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ అంటే కేవలం ట్రాక్ పక్కన ఎర్ర పచ్చ లైట్లు చూపించే వ్యవస్థ కాదు. రైల్ ఎక్కడుంది ఎంత వేగంతో వెళ్తుంది ముందుగా ట్రాక్ ఖాళీగా ఉందా వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా ఇలాంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించే మోడర్న్ సిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ట్రాక్ బిజీగా ఉంటే ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టం డ్రైవర్ ను హెచ్చరించడమే కాకుండా అవసరమైతే ఆటోమేటిక్ గా బ్రేకులు కూడా వేయగలదు. మరి అలాంటి ఆటోమేటిక్ వ్యవస్థ పని చేయకపోతే ఇక్కడే రైళ్లను మాన్యువల్ గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రతి రైళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. స్పీడ్ కంట్రోల్ చేయడంపై క్లారిటీ ఇవ్వాలి. ట్రాక్ నిజంగా ఖాళీగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక చిన్న కమాండ్ తప్పు వచ్చినా ఇలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ స్పెయిన్ ట్రైన్ యక్సిడెంట్. స్పెయిన్ కు చెందిన ఏవఈ నెట్వర్క్ యూరోప్ లోనే అత్యంత సురక్షితమైన వేగవంతమైన విజయవంతమైన హై స్పీడ్ ట్రైన్ సిస్టం ఇది 1992 నుంచి అందుబాటులోకి ఉంది. అలాంటి నెట్వర్క్ లో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఇప్పుడు మన దేశం విషయానికి వద్దాం..
ఇండియాలో నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ లో జపాన్ షింకాన్సస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జపాన్ బుల్లెట్ ట్రైన్లు ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ అధునాతన సిగ్నలింగ్ నిరంతర పర్యవేక్షణ వంటి భద్రత వ్యవస్థలకు కేర్ ఆఫ్ గా ఉంటాయి. సేఫ్టీ విషయంలో వీటికి ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జపాన్ కి చెందిన అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చి మన దగ్గర ఉపయోగించడం మాత్రమే భద్రతకు పూర్తి హామి కాదు. ఆ టెక్నాలజీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏదైనా తప్పు జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నారు అత్యవసర పరిస్థితిలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ రైలు ఎంత వేగంగా వెళ్తుంది అన్నదానికంటే ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఎంత త్వరగా ఎంత ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. భారత్ ఇప్పటికే తన సొంత ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ అయినటువంటి కవచ్ ను డెవలప్ చేసి రైల్వే నెట్వర్క్ లో ఉపయోగిస్తుంది. రైళ్లు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా వెళ్ళాల్సిన దానికంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్తున్న వెంటనే రియాక్ట్ అయి ప్రమాదం జరగకుండా ట్రైన్ ని నిలిపి వేస్తుంది ఈ కవచ్ సిస్టం. మరి కవచ్ ఉందిగా జపాన్ టెక్నాలజీ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు.
భారత్ లో మూడు ముఖ్యమైన పాఠాలు..
అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. సాధారణ రైల్వే నెట్వర్క్ లో ఉపయోగించే భద్రతా వ్యవస్థలు వేరు. గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే ప్రత్యేక హై స్పీడ్ భద్రత వ్యవస్థలు వేరు. ఎందుకంటే మన ఇండియన్ రైల్వేస్ హైయెస్ట్ ఆపరేషన్ స్పీడ్ 160 km మాత్రమే. అందుకే మన కవచ్ బుల్లెట్ ట్రైన్లకు సెట్ అవ్వదు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ లో దానికి అనుగుణంగా రూపొందించిన సిగ్నలింగ్, ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్, కమ్యూనికేషన్, ట్రాక్ పర్వేక్షణలో వ్యవస్థలు అవసరం. ఇక స్పెయిన్ ప్రమాదం నుంచి భారత రైల్వే అధికారులు భద్రతా నియంత్రణ సంస్థలు మూడు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఒక వ్యవస్థ విఫలమైన వెంటనే ప్రమాదం జరగకుండా ఉండేందుకు మరో వ్యవస్థ ఉండాలి. ప్రధాన సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయకపోతే ప్రత్యాన్యాయంగా భద్రతా వ్యవస్థ కూడా పనిచేయాలి. ట్రాక్ పై ట్రైన్ ఎక్కడఉందన్నది స్పష్టత లేకపోతే రైల్‌ను ఆపేసి టెక్నాలజీ ఉండాలి. రెండవది కంట్రోల్ రూమ్ నిర్ణయాల్లో తప్పులకు అవకాశం తగ్గించాలి. మాన్యువల్ గా రైళ్లను నడిపే పరిస్థితిలో ఒకరి నిర్ణయం పైన ఆధారపడకుండా అవసరమైన చోట రెండో కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా అవసరమైన వ్యవస్థలు ఉండాలి. ఇక మూడోది నిరంతరం మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు తనికీలు చేయడం తప్పనిసరి. ఇక అతి ముఖ్యమైనది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సిబ్బంది ఎలా రియాక్ట్ అవ్వాలనే దానిపైన ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన అంశం ఉంది స్పెయిన్ లో ప్రభుత్వ రంగానికి చెందిన రెన్ఫే ప్రైవేట్ ఆపరేటర్ ఇరియో రైళ్లు కూడా ఒకే హై స్పీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగిస్తున్నాయి.
Also Read: మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!
టెక్నాలజీ ఎంత గొప్పదైనా..
ఇలాంటి పరిస్థితిలో వివిధ రైళ్ల మధ్య కోఆర్డినేషన్ కంట్రోల్ రూమ్ నుంచి ఇచ్చే ఆదేశాలు ట్రాక్ పై ఇన్ఫోను షేర్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. భారత్ లో ప్రస్తుతం ఉన్న రైల్వే వ్యవస్థపతో పోలిస్తే భవిష్యత్తులో హై స్పీడ్ రైలు సేవలు విస్తరించినప్పుడు కూడా ప్రతి రైలు కదలికపై సెంట్రల్ కమాండ్ కు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉండాలి. అందుకే స్పెయిన్ ప్రమాదాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. టెక్నాలజీ ఎంత లేటెస్ట్ అయినా దానికి సరైన భద్రత విధానాలు శిక్షణ పొందిన సిబ్బంది తప్పనిసరి మెయింటనెన్స్ అత్యవసర పరిస్థితుల్లో తప్పులకు అవకాశం తగ్గించే వ్యవస్థలు తోడుగా ఉండాలి. ఎందుకంటే హై స్పీడ్ రైలలో వేగం ఎంత ముఖ్యమో ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడం అంతకంటే ముఖ్యం.