Wet and dry vacuum cleaner: మన దేశంలో దీపావళి పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళికి ముందు ఇళ్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్ముతారు.అందుకే.. ఇళ్లన్నింటినీ సున్నాలు వేయడం, బూజు దులపడం, మూలలను క్లీన్ చేయడం వంటి పనులు తప్పకుండా చేస్తుంటారు. అయితే.. ఈ క్లీనింగ్ పనుల వల్ల కాళ్లు, చేతులు నొప్పులు రావడం సహజం. ఈ టెక్నాలజీ యుగంలో ఆ కష్టాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మార్కెట్లో వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్లు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి.ఇవి కేవలం డస్ట్ మాత్రమే కాకుండా.. ఇంట్లో పడిన నీటిని లేదా తడి మరకలను కూడా క్షణాల్లో క్లీన్ చేస్తాయి. ఇంతకీ టాప్-5 వాక్యూమ్ క్లీనర్లు ఏవో తెలుసుకుందామా..
టాప్-5 వాక్యూమ్ క్లీనర్లు:
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఈ మోడల్ ఒకటి. ఇది పవర్ ఫుల్ మోటార్‌తో వస్తుంది. కాబట్టి ఇది ఇళ్లలోని ఏ మూలన ఉన్న బూజు, చెత్తనైనా లాగేస్తుంది. దీనిలో బ్లోవర్ ఫంక్షన్ ఉండటం వల్ల కిటికీల్లోని చెత్తను బయటకు గాలితో నెట్టొచ్చు. దీని 10 లీటర్ల కెపాసిటీ, బలమైన సక్షన్ పవర్ , వాటర్ అబ్సార్ప్షన్ అద్భుతంగా పని చేస్తాయి. దీని అంచనా ధర సుమారు రూ. 6,000 నుంచి రూ.7,500 మధ్య ఉంటుంది.
క్లీనింగ్ రంగంలో బెస్ట్ పేరున్న బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ ఇళ్లలోని సోఫాలు, కార్పెట్లు, నేలపై ఉన్న తడి మరకలను క్లీన్ చేస్తుంది. దీంతో పాటు వచ్చే పలు రకాల అటాచ్‌మెంట్లు ప్రతీ మూలను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. డీప్ క్లీనింగ్ టెక్నాలజీ, హెవీ డ్యూటీ మోటార్ , ఈజీ వీల్స్ దీని ప్రత్యేకతలు.దీని ధర సుమారు రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుంది.
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఈ వాక్యూమ్ క్లీనర్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది సింపుల్ డిజైన్‌తో వస్తుంది కాబట్టి ఇంట్లో ఒక చోటి నుంచి మరో చోటికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇది పొడి చెత్తతో పాటు కిచెన్ సింక్ దగ్గర లేదా బాత్రూమ్‌లో ఉన్న నీటిని కూడా ఈజీగా పీల్చుకుంటుంది. కాంపాక్ట్ డిజైన్, లైట్‌వెయిట్, మల్టీపర్పస్ నాజిల్స్ దీని సొంతం. దీని అంచనా ధర సుమారు రూ 4,500 నుంచి రూ.5,500 మధ్య ఉంటుంది.
గాడ్జెట్ పర్ఫామెన్స్‌కు పని తీరుకు పేరుగాంచాయి. ఈ వాక్యూమ్ క్లీనర్ పెద్ద ఇళ్లకు లేదా అపార్ట్‌మెంట్‌లకు చాలా బాగా సరిపోతుంది. ఇది దుమ్మును పూర్తిగా క్లీన్ చేయడమే కాకుండా.. గాలిని కూడా శుభ్రంగా ఉంచుతుంది. స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ, లార్జ్ డస్ట్ ట్యాంక్ , హై సక్షన్ పవర్ దీని ప్రత్యేకతలు.దీని ధర సుమారు రూ.5,500 నుంచి రూ.7,000 మధ్య ఉంటుంది.
Also Read: ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!
స్టైలిష్ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో.. వస్తున్న ఈ దీపావళి క్లీనింగ్‌ను చాలా ఈజీ చేస్తుంది. తక్కువ సౌండ్ చేస్తూ అత్యధిక పని తీరును కనబరుస్తుంది. కార్పెట్లు, కర్టెన్లు , కార్లను కూడా దీనితో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. సైలెంట్ ఆపరేషన్, థర్మల్ ప్రొటెక్షన్ మోటార్ ,యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు దీనిలో ఇందులో ఉన్నాయి.దీని ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది.
దీపావళి పండగ సమయంలో.. ఇల్లు శుభ్రం చేయడం ఇకపై పెద్ద కష్టమే కాదు. మార్కెట్లో అందుబాటులో.. ఉన్న ఈ వాక్యూమ్ క్లీనర్లలో మీ బడ్జెట్‌కు సరిపోయేదాన్ని ఎంచుకోండి. చేతి నొప్పులు లేకుండా, సమయం ఆదా చేసుకుంటూ.. మీ ఇంట వెలుగులు నింపే ఈ దీపావళిని మరింత సంతోషంగా జరుపుకోండి!