E-Paper
Advertisement

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?
Advertisement

Mystery Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్‌లో హత్యల వెనుకున్న కారణం ఏంటనే ఉత్కంఠతో పాటు, వాటికి ఏదైనా వింత నమ్మకం లేదా పురాతన శాపం ముడిపడి ఉంటే ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాంటి ఓ ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన తమిళ సినిమానే ‘డార్క్ హెవెన్’ (Dark Heaven). ప్రతి ఏడేళ్లకోసారి జూన్ నెలలో ఆ ఊరిలోని మగవాళ్లు వరుసగా చనిపోతుంటారు. ఈ మరణాలను గ్రామస్తులు ఓ పురాతన శాపంగా భావిస్తుంటే, కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాత్రం దీని వెనుక ఎవరో కిల్లర్ ఉన్నాడని అనుమానిస్తాడు. ఆ తర్వాత అతడి దర్యాప్తులో బయటపడే రహస్యాలు, ఊహించని మలుపులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే…

కథలోకి వెళ్తే…

మేక్కరై ఓ మారుమూల పర్వత ప్రాంత గ్రామం. అక్కడి ప్రజలను చాలాకాలంగా ఓ భయం వెంటాడుతుంటుంది. ప్రతి ఏడేళ్లకు ఒకసారి జూన్ నెలలో గ్రామంలోని మగవాళ్లు అనూహ్యంగా మరణిస్తుంటారు. దీనికి కారణం ఓ పురాతన శాపమని స్థానికులు నమ్ముతారు. ఆ నమ్మకం ఎంత బలంగా పాతుకుపోయిందంటే, జూన్ నెల వచ్చిందంటేనే గ్రామంలో భయాందోళనలు మొదలవుతాయి. మళ్లీ ఏడేళ్ల తర్వాత అదే నెలలో మరణాలు మొదలవడంతో ఈ కేసు దర్యాప్తు కోసం ఇన్‌స్పెక్టర్ ఇళంపారి ఆ గ్రామానికి బదిలీపై వస్తాడు. ఈ పాత్రలో సిద్ధు సిద్ధ్ నటించాడు. పోలీస్ అధికారిగా మూఢనమ్మకాలను నమ్మని ఇళంపారి, మరణాలన్నింటినీ శాపానికి ముడిపెట్టడాన్ని అంగీకరించడు. ఎవరో ఒకరు పక్కా ప్రణాళికతో ఈ హత్యలకు పాల్పడుతున్నారని భావించి విచారణ ప్రారంభిస్తాడు.

Advertisement

దర్యాప్తు సాగుతున్న సమయంలో గ్రామ లైబ్రేరియన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. అతడి ఆచూకీ కోసం వెతుకుతున్న కూతురు పోలీసులకు సహకరించేందుకు ముందుకొస్తుంది. ఆమె ఇచ్చే వివరాలు కేసులో కొత్త కోణాలను తెరపైకి తీసుకొస్తాయి. ఒకవైపు లైబ్రేరియన్ అదృశ్యం, మరోవైపు వరుస మరణాలు.. ఈ రెండింటికీ ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం ఇళంపారికి కలుగుతుంది. అసలు ఏడేళ్లకోసారి ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి ? మగవాళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్న వ్యక్తి ఎవరు ? గ్రామస్తులు నమ్ముతున్న శాపం వెనుక దాగి ఉన్న నిజం ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సినిమాను చూడాల్సిందే.

Also Read : గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

3 ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

సిద్ధు సిద్ధ్ (Sidhu Sid), రిత్విక (Riythvika) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బాలాజీ (Balaaji) దర్శకత్వం వహించారు. ఈ తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా తమిళం (Aha Tamil), సింప్లీ సౌత్ (Simply South) వంటి ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి తమిళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. ఇన్వెస్టిగేషన్ కథలు, వరుస హత్యల వెనుక రహస్యాలను ఛేదించే థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి వీకెండ్ ఛాయిస్.

Related News

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

గంటకు 50 రెట్లు జీతం ఇస్తామంటూ జాబ్ ఆఫర్… ఒక్కో షిఫ్ట్‌లో ఊచకోత… క్రేజీ కొరియన్ హారర్ థ్రిల్లర్‌ తెలుగులో

పద్ధతిగా జరిగే పిల్లల బర్త్ డే పార్టీ… పెద్దల మధ్య చిచ్చుపెట్టే బహుమతి… ఈ రచ్చ తెలుగులోనూ స్ట్రీమింగ్

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

తాగుడు అలవాటుతో ఊరంతా రచ్చ… తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ గోల చూస్తే నవ్వు ఆగదు

Big Stories

Advertisement
×