AP Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీసీ కెమెరాలు లేదా వీడియో రికార్డింగ్ తప్పనిసరి అని కోర్టు క్లారిటీ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోనూ వీడియో రికార్డింగ్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ నిఘా ఆదీనంలోనే చేయాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియో ఫుటేజీ భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల పిటిషన్ల శాఖలు గడువు ముగిసే వరకు ఫుటేజీని భద్రపరచాలని కోర్టు తెలిపింది. ఎన్నికల పిటిషన్లు దాఖలైతే కేసు తుది పరిష్కారం అయ్యే వరకు ఫుటేజీ భద్రత ఉంచాలని కోర్టు క్లారిటీ ఇచ్చింది.
భవిష్యత్తులో అవసరమైన ఫుటేజీని ఎన్నికల ట్రిబ్యునల్‌కు అందించాలని స్పష్టీకరణ చేసింది. ఎన్నికల పిటిషన్‌లోని సంబంధిత పక్షాలు దరఖాస్తు చేసుకుంటే ఫుటేజీ అందుబాటులో ఉంచాలని కోర్టు తెలిపింది. అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా భద్రత కల్పించాలని డీజీపీకి కోర్టు ఆదేశించింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.