E-Paper
Advertisement

ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!

ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!
Advertisement

Best Tourist Places: నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. వర్షాలు తగ్గిపోయి, చలి మొదలయ్యే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎండల భయం లేకుండా హాయిగా బయట తిరగడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి ఇది బెస్ట్ సీజన్. ఈ క్రమంలో మీరు చారిత్రక కట్టడాలు చూడాలనుకున్నా, ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకున్నా, లేదా ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్నా నవంబర్ నెలలో ఇండియాలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. మరి ఈ మీ హాలిడేను మర్చిపోలేని విధంగా మార్చే 5 బెస్ట్ డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

జైసల్మేర్, రాజస్థాన్:

ఎడారి వేడి తగ్గి, వాతావరణం చల్లబడే నవంబర్ నెలలో జైసల్మేర్ ట్రిప్ చాలా బాగుంటుంది. బంగారు రంగు ఇసుక రాళ్లతో నిర్మించిన కట్టడాలకు ఈ నగరం పెట్టింది పేరు. ఇక్కడ జైసల్మేర్ కోట, పట్వాన్ కీ హవేలీ, గడిసార్ సరస్సు తప్పకుండా చూడాలి. అంతేకాకుండా.. సామ్ ఇసుక తిన్నెలపై డెసర్ట్ సఫారీ చేయడం, రాత్రిపూట నక్షత్రాల కింద రాజస్థానీ జానపద సంగీతాన్ని ఆస్వాదించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

షిల్లాంగ్, మేఘాలయ:

Advertisement

అందమైన కేఫ్‌లు, కనువిందు చేసే వ్యూపాయింట్లతో షిల్లాంగ్ నవంబర్ నెలలో ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక్కడి చల్లని వాతావరణంలో స్థానిక మార్కెట్లు, వార్డ్స్ లేక్, ఉమియమ్ సరస్సు అందాలను హాయిగా చూసి రావచ్చు. అంతేకాదు.. ఇక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న చిరపుంజికి వెళ్లి అద్భుతమైన జలపాతాలు, గుహలు, పచ్చని ప్రకృతి అందాలను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: ఉదయం టిఫిన్‌కు రవ్వ ఉప్మా మంచిదా, ఓట్స్ తింటే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!

వారణాసి, ఉత్తరప్రదేశ్:

Advertisement

నవంబర్‌లోని ఆహ్లాదకరమైన వాతావరణంలో వారణాసి ఆధ్యాత్మిక వైభవాన్ని చూడటం ఎంతో బాగుంటుంది. ప్రాచీన ఘాట్‌ల వెంబడి నడవటం, గంగా నదిలో పడవ ప్రయాణం చేయడం, సాయంత్రం వేళ జరిగే గంగా హారతిని కళ్లారా చూడటం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడి ఇరుకు గల్లీలు, దేవాలయాలు, స్థానిక రుచులు, రద్దీగా ఉండే మార్కెట్లు మన భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.

హంపి, కర్ణాటక:

చరిత్ర, శిల్పకళల పట్ల ఆసక్తి ఉన్నవారికి నవంబర్‌లో హంపి ఒక అద్భుతమైన ఎంపిక. ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన ఈ యునెస్కో వారసత్వ ప్రదేశం, తన అద్భుతమైన దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు, ప్రత్యేకమైన రాతి కొండలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి విరూపాక్ష ఆలయం, విఠల ఆలయ సముదాయం, ప్రపంచ ప్రఖ్యాత రాతి రథాన్ని చూస్తూ మన ఘనమైన చరిత్ర విశేషాలను తెలుసుకోవచ్చు.

అలెప్పీ, కేరళ:

హడావిడి లేకుండా ప్రశాంతంగా సెలవులు గడపాలనుకునే వారికి కేరళలోని అలెప్పీ బెస్ట్ ఛాయిస్. నవంబర్ నెలలో ఇక్కడి బ్యాక్ వాటర్స్ అందాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. సాంప్రదాయ హౌస్‌బోట్‌లో ప్రయాణిస్తూ కాలువలు, పచ్చని కొబ్బరి తోటలు, పల్లెటూరి జీవనశైలిని దగ్గరగా చూడవచ్చు. వీటితో పాటు కేరళ ప్రత్యేక వంటకాలను రుచి చూస్తూ ఈ ట్రిప్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: క్లాస్ టాపర్ పక్కన కూర్చుంటే మీ పిల్లలు కూడా బాగా చదువుతారా? సైకాలజీ ఏం చెబుతోందంటే!

Tags

Related News

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి షాక్.. అప్పుడే నిండిపోయిన రైళ్లు!

చలికాలంలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? మంచు కొండల మధ్య ఈ 5 ప్రాంతాలు సూపర్

Pamban Bridge Tragedy: రన్నింగ్ రైల్లో నుంచి సముద్రంలోకి జంప్.. యువకుడు బలి, యువతి పరిస్థితి..

విమానం ముక్కు చిట్లింది.. అసలు ఏం జరిగింది? మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

రైల్లో తాగుబోతు వీరంగం.. మైనర్ బాలికలతో అసభ్య ప్రవర్తన, వీపు చింతపండు చేసిన ప్రయాణికులు!

బ్రేకులు ఫెయిలైనా 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ లో ఇంత నిర్లక్ష్యమా?

Big Stories

Advertisement
×