E-Paper
Advertisement

విమానం ముక్కు చిట్లింది.. అసలు ఏం జరిగింది? మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

విమానం ముక్కు చిట్లింది.. అసలు ఏం జరిగింది? మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ
Advertisement

Miami Airport: ట్రెండ్ మారింది.. దానికి తగినట్టుగానే అడుగులు పడుతున్నాయి. రోడ్లపై వాహనాలు ఢీ కొనడం తరచూ వినిపిస్తున్నమాట. ఈ సీజన్‌లో మరింత ఎక్కువైంది. ఆ తర్వాత ఓడలు, ఇప్పుడు విమానాలు ఢీ కొన్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పుడు అదే జరిగింది. మియామీ ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీ కొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ కొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ విమానం పాక్షికంగా దెబ్బతింది. మరొక విమానం ముందు భాగం భారీగా డ్యామేజ్ అయ్యింది. పనామా సిటీ నుంచి 166 మంది ప్రయాణికులతో ల్యాండైంది కోపా ఎయిర్‌లైన్స్ విమానం. అయితే రన్‌వేపై కదులుతుండగా ఆ విమానం రెక్క చివరి భాగం కార్గో విమానం ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టింది.

Advertisement

ఘటనకు ముందు విమానంలోని ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జరిగిన ఘటనపై కోపా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ ప్రమాదంపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. రెండు నెలల కిందట ఈ విమానాశ్రయంలో అమెజాన్ కార్గో విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. సమీపంలోని వాహనాలను ఢీ కొట్టిన విషయం తెల్సిందే. ఇప్పుడు రెండు విమానాల వంతు జరగడంతో మియామీ ఎయిర్‌పోర్టు పేరు చెప్పగానే ప్రయాణికుల్లో కాస్త అలజడి మొదలైంది.

ALSO READ: వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

Advertisement

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో సమాచార లోపం కారణంగా అమెరికాలో గంటల తరబడి విమానాలు నిలిపివేశారు. ఒక రోజు తర్వాత విమానాశ్రయంలోని టాక్సీవేపై రెండు విమానాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.స్థానిక కాలమానం ప్రకారం విమానాల ఢీ కొన్న ఘటన రాత్రి సుమారు 9 గంటల సమయంలో జరిగింది. ఘటనకు ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు UPS సిబ్బందిని కోపా విమానానికి దారి ఇవ్వమని కోరారట. కోపా విమానం గేట్ వైపు వెళ్తుండగా UPS విమానం కొలంబియాలోని బొగోటాకు బయలుదేరడానికి రెడీ అవుతోందని FAA తెలిపింది.

విమానం ల్యాండింగ్ తర్వాత సాధారణ వేగంతో టాక్సీయింగ్ కోపా ఎయిర్ లైన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నా చుట్టూ పలువురి మాటలు బిగ్గరగా వినిపించాయని, ఆ తర్వాత అందరూ కలిసి అరిచిన తర్వాత మరో విమానం మా విమానాన్ని ఢీ కొట్టిన శబ్దం వినిపించిందని అందులో సిబ్బంది చెబుతున్నారు. క్యాబిన్ లోపల విమానం అకస్మాత్తుగా పక్కకు కుదుపుకు గురైనట్లు అనిపించిందన్నారు. తొలుత కొంతమంది ప్రయాణికులు భయపడటం ప్రారంభించారని, కోపా సిబ్బంది త్వరగా స్పందించడంతో వారు సీట్లలో ఉండేలా చూశారని వివరించారు.

 

Related News

వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

రైల్లో తాగుబోతు వీరంగం.. మైనర్ బాలికలతో అసభ్య ప్రవర్తన, వీపు చింతపండు చేసిన ప్రయాణికులు!

బ్రేకులు ఫెయిలైనా 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ లో ఇంత నిర్లక్ష్యమా?

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో సంచలనం.. యువతి సహా ఇద్దరు అరెస్ట్.. పాక్‌తో సంబంధాలు!

మన రైల్వే టెక్నాలజీకి జపాన్ ఫిదా.. ఏకంగా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసింది!

రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

సీతమ్మ ఊరి నుంచి రామయ్య అయోధ్యకు కొత్త రైలు.. ఇండియన్ రైల్వే గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×