E-Paper
Advertisement

రైల్లో తాగుబోతు వీరంగం.. మైనర్ బాలికలతో అసభ్య ప్రవర్తన, వీపు చింతపండు చేసిన ప్రయాణికులు!

రైల్లో తాగుబోతు వీరంగం.. మైనర్ బాలికలతో అసభ్య ప్రవర్తన, వీపు చింతపండు చేసిన ప్రయాణికులు!
Advertisement

Rajdhani Express Safety Scare: భువనేశ్వర్‌-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. వీరిలో ఓ వ్యక్తి మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తోటి ప్రయాణికులు నిలదీశారు. దేహశుద్ధి చేసి అధికారులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మద్యం సేవించి ప్రయాణికులకు ఇబ్బందులు

రాజధాని ఎక్స్‌ ప్రెస్‌లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో మైనర్ బాలికలను ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రైలులో ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొందరు ప్రయాణికులు అతడిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు తన ఫోన్‌లో వీడియో తీశారు.

బ్యాగులో మద్యం సీసాలు.. వీడియో వైరల్

Advertisement

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి బ్యాగును చెక్ చేయడంతో అందులో మద్యం సీసాలు ఉన్నట్లు తోటి ప్రయాణికులు గుర్తించారు. రైలు ప్రయాణంలో మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగించడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి. రైలులో మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రైల్వే అధికారులు ఏం చేశారంటే?

ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని రైలు నుంచి కిందకు దించినట్లు సమాచారం. రైలులో మద్యం సేవించడం, ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం లాంటి చర్యలను రైల్వే శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.

Advertisement

ప్రయాణికులకు రైల్వే కీలక సూచనలు

రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా కూడా సాయం కోరవచ్చు. ఈ ఘటన మరోసారి రైలు ప్రయాణాల్లో మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చకు దారితీసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Read Also: బ్రేకులు ఫెయిలైనా 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ లో ఇంత నిర్లక్ష్యమా?

Tags

Related News

బ్రేకులు ఫెయిలైనా 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ లో ఇంత నిర్లక్ష్యమా?

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో సంచలనం.. యువతి సహా ఇద్దరు అరెస్ట్.. పాక్‌తో సంబంధాలు!

మన రైల్వే టెక్నాలజీకి జపాన్ ఫిదా.. ఏకంగా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసింది!

రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

సీతమ్మ ఊరి నుంచి రామయ్య అయోధ్యకు కొత్త రైలు.. ఇండియన్ రైల్వే గ్రీన్ సిగ్నల్!

రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారా? మీ కన్ఫర్మ్ టికెట్‌ ఇతరులకు బదిలీ చేయండి ఇలా

రైలు కిటికీలకు అద్దాలు ఉన్నా ఇనుప కడ్డీలు ఎందుకు? ఇదీ అసలు కథ!

Big Stories

Advertisement
×