E-Paper
Advertisement

Free Train Service: ఈ రైల్లో వెళ్లేందుకు టికెట్ అవసరం లేదు, 75 ఏండ్లుగా ఫ్రీ సర్వీస్ అందిస్తున్న ట్రైన్ గురించి మీకు తెలుసా?

Free Train Service: ఈ రైల్లో వెళ్లేందుకు టికెట్ అవసరం లేదు, 75 ఏండ్లుగా ఫ్రీ సర్వీస్ అందిస్తున్న ట్రైన్ గురించి మీకు తెలుసా?
Advertisement

Indian Railways: మనం సాధారణంగా రైలు ప్రయాణం చేస్తుంటాం. రైలు ఎక్కాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టక తప్పదు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ, దేశంలో ఓ రైల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇందులో ఎక్కాంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ రైలు ఎక్కడుంది? ఎందుకు ఉచితంగా ప్రయాణీకులను తీసుకెళ్లుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

75 వసంతాలుగా ఉచిత ప్రయాణం

Advertisement

ఉచిత ప్రయాణ సేవలను అందిస్తున్న ఈ రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ మధ్యలో నడుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా, పంజాబ్ లోని నంగల్ మధ్య సుమారు 13 కిలో మీటర్ల మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు మొత్తం 6 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు మూడు సొరంగ మార్గాల గుండూ పరుగులు తీస్తుంది. అద్భుతమైన ప్రకృతి అందాలను పరిచయం చేస్తుంది.

ఎందుకు ఈ రైలు ఉచితం ప్రయాణం అందిస్తుందంటే?

Advertisement

భాక్రా-నంగల్ రైలు 1948లో ప్రారంభించబడింది. దేశ స్వాతంత్ర్యం అనంతరం మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా భాక్రా-నంగల్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కార్మికులతో పాటు నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడంలో ఈ రైలు కీలక పాత్ర పోషించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ రైలును అలాగే కొనసాగించారు. ప్రాజెక్టు పరిసర గ్రామ ప్రజలు, విద్యార్ధులు ఈ రైలు ద్వారా ప్రయాణించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రైలు ఉచితంగానే సర్వీసులు అందిస్తున్నది. రోజూ సుమారు 800 మందికి పైగా జనాలు ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగిస్తుంది.

Read Also: ఇండియాలో రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయి? కారణాలు మీకు తెలుసా?

BBMB ఆధ్వర్యంలో రైలు నిర్వహణ

దేశంలోని అన్ని రైళ్లను భారతీయ రైల్వే నడిపిస్తుండగా, ఈ రైలును మాత్రం భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(BBMB) నిర్వహిస్తుంది. 75 ఏండ్లుగా ఈ ఉచిత ప్రయాణ సేవను అందిస్తున్నది. ఈ రైలు నిర్వహణకు భారీగా ఖర్చు అవుతున్నప్పటికీ తన ఉచిత ప్రయాణ వారస్తత్వాన్ని కొనసాగిస్తున్నది. ఈ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో స్ట్రీమ్ ఇంజిన్ ను ఉపయోగించే వాళ్లు. 1953లో డీజిల్ ఇంజిన్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం సరికొత్తగా రూపుదిద్దుకుంది. భాక్రా-నంగల్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే పర్యాటకులు సైతం ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తారు. ఈ రైలులో ఎవరైనా ప్రయాణించవచ్చు అంటున్నారు ప్రాజెక్టు అధికారులు. ఈ రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లొచ్చు. ఈ రైలును ఎక్కువగా విద్యార్థులు, స్థానికులు ప్రయాణం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.

Read Also: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×