Indian Railway: సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో ట్రాక్ పక్కనే చాలా బోర్డులు కనిపిస్తుంటాయి. ఒక్కో బోర్డు ఒక్కో విషయాన్ని సూచిస్తుంది. అయితే, ప్రయాణీకులు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాటితో ప్రయాణీకులకు పెద్దగా అససరం ఉండదు. అయితే, రైల్వే గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లు ఈ బోర్డుల గురించి తెలుసుకోవడం మంచిది. వారి కోసమే ఈ స్టోరీ..
W/B బోర్డు అర్థం ఏంటో తెలుసా?
సాధారణంగా రైల్లో వెళ్లే సమయంలో W/D అనే బోర్డులు కనిపిస్తుంటాయి. వీటి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. వీటిని రైల్వేలో విజిల్ బోర్డుగా పిలుస్తుంటారు. వీటిని రైల్వే గేట్ల దగ్గర, మూల మలుపుల దగ్గర ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. రైలు నడిపే పైలెట్, ఈ బోర్డులను చూడగానే హారన్ కొడతారు. రైలు వస్తుంది పక్కకు జరగండి అని దీని అర్థం. చాలా మంది సిగ్మా బోర్డును చూసి విజిల్ బోర్డు అనుకుంటారు. అయితే, సిగ్మా బోర్డు అనేది సిగ్నల్ దగ్గర ఉంటుంది. విజిల్ బోర్డు అనేది రైల్వే గేట్లతో పాటు మూల మలుపులు, ప్రమాదకర పరిస్థితులు ఉన్న దగ్గర ఉంటుంది.
రైల్వే స్టేషన్లు ఇన్ని రకాలా?
భారత్ లో పలు రకాల రైల్వే స్టేషన్లు ఉంటాయి. కొన్ని స్టేషన్లకు జంక్షన్ అని ఉంటుంది. మరికొన్ని స్టేషన్లకు టెర్మినల్ అని ఉంటాయి. ఇంకొన్ని స్టేషన్లకు సెంట్రల్ అని ఉంటుంది. మరికొన్నింటికి కంటోన్మెంట్ అని ఉంటుంది. మరికొన్నింటికి రోడ్ అని ఉంటుంది. ఇంతకీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయంటే..
⦿కంటోన్మెంట్: రైల్వే స్టేషన్ సమీపంలో ఏరియా ఉంటే కంటోన్మెంట్ అని పేరు పెడతారు.
⦿ రోడ్: కొన్ని ఏరియాలకు రైల్వే మార్గం వేసే అవకాశం ఉండదు. అప్పుడు ఊరికి కొంచెం దగ్గర నుంచి ట్రాక్ అనేది వెళ్తుంది. అక్కడ స్టేషన్ ను కట్టి ఆ ఊరి పేరు తర్వాత రోడ్ అని యాడ్ చేస్తారు. ఉదాహారణకు మదనపల్లి రోడ్.
Read Also: వందే భారత్ స్లీపర్ రైల్‌కు బుల్లెట్ ప్రూఫ్ విండోలు? రైల్వేశాఖ ఏం చెప్పిందంటే?
⦿ జంక్షన్: స్టేషన్ నుంచి వెళ్లడానికి, రావడానికి రెండు, అంతకు మించి రైల్వే రూట్లు ఉంటే దాన్ని జంక్షన్ అంటారు. ఉదాహారణకు భీమవరం జంక్షన్.
⦿ టెర్మినల్: టెర్మినల్ అంటే ఎండ్. ఆ ట్రాక్ అక్కడితో ఎండ్ అవుతుంది. ఆ స్టేషన్ కు వచ్చిన రైలు, వచ్చిన రూట్ లోనే వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఉదాహారణకు శ్రీ ఎం విశవేశ్వరయ్య టెర్మినల్, బెంగళూరు.
Read Also: ఇండియాలో రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయి? కారణాలు మీకు తెలుసా?
⦿ సెంట్రల్: మన దేశంలో 5 మాత్రమే సెంట్రల్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు సిటీ మధ్యలో ఉంటాయి. అక్కడికి ఎక్కువ మంది ప్రయాణీకులు వస్తారు. ఎక్కువ సంఖ్యలో రైళ్లు కూడా వస్తుంటాయి. ఉదాహారణకు చెన్నై సెంట్రల్.
Read Also: అన్ని లైన్లలో.. ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనేది లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుంది?